Movie News

నాని… సరిపోదా గురువారం

నేచురల్ స్టార్ నాని ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలు ఎంచుకుంటూ ట్రెండ్ సెట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ‘దసరా’తో సెన్సేషన్ క్రియేట్ చేశాక ఆ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో అతను కొత్తగా అనౌన్స్ చేసిన ‘ది ప్యారటైజ్’ సినిమా నుంచి తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ప్రకంపనలు రేపుతోంది. టీజర్లో నాని లుక్.. హీరో గురించి ఇంట్రో ఇస్తూ తల్లి పాత్రతో చెప్పించిన బూతు డైలాగ్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీశాయి. ఇంకా షూటింగ్ దశకు వెళ్లని ఈ సినిమాకు అప్పుడే రిలీజ్ డేట్ ఖరారు చేసేశారు. వచ్చే ఏడాది మార్చి 26న ‘ది ప్యారడైజ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తోనే ఈ డేట్ ఎంచుకున్నారని అర్థమవుతోంది.

వేసవి సీజన్ ఆరంభం.. పైగా శ్రీరామ నవమి వీకెండ్లో సినిమాను రిలీజ్ చేయడం కచ్చితంగా కలిసొచ్చేదే. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ చిత్రం గురువారం విడుదల అవుతోంది. ఇది నాని ఉద్దేశపూర్వకంగా ప్లాన్ చేసింది కావడం విశేషం. సాధారణంగా కొత్త సినిమాలు శుక్రవారం రోజే విడుదల అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్ ఇది. పండుగలను పురస్కరించుకుని కొంచెం ముందు వెనుక రిలీజ్ చేస్తుంటారు కానీ.. మామూలుగా అయితే అందరూ కొత్త సినిమాల విడుదలకు ప్రిఫర్ చేసేది శుక్రవారాన్నే. కానీ నాని మాత్రం గత కొన్నేళ్లుగా తన చిత్రాలను గురువారమే రిలీజ్ చేస్తున్నాడు. ఇది అతడికి బాగానే కలిసొస్తోంది.

దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలను గురువారాల్లోనే రిలీజ్ చేయించాడు. ఈ వేసవిలో రాబోతున్న నాని కొత్త చిత్రం ‘హిట్ 3’ సైతం మే 1న గురువారమే రిలీజ్ కాబోతోంది. ఈ సెంటిమెంటును కొనసాగిస్తూ ‘ది ప్యారడైజ్’కు కూడా గురువారాన్నే ఎంచుకున్నాడు. దీని గురించి ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్లలో నాని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. తన సినిమాలు గురువారాల్లోనే రిలీజయ్యేలా చూసుకుంటున్నట్లు చెబుతూ.. ‘సరిపోదా గురువారం’’ అని అతను కామెంట్ చేయడం విశేషం. గురువారం సినిమాను రిలీజ్ చేయడం వల్ల లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీ ఉంటోంది. సినిమాకు హైప్ ఉంటే కలెక్షన్ల పరంగా ఇది బాగా కలిసొచ్చే విషయమే.

This post was last modified on March 4, 2025 1:00 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

1 minute ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

10 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

24 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

26 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

2 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

3 hours ago