అజిత్ కోసం ధనుష్ త్యాగం చేశాడా ?

ఒకరి కోసం మరొక హీరో సర్దుబాటు చేసుకోవమనేది ఇండస్ట్రీలో తరచుగా గమనిస్తూ ఉంటాం. బాహుబలికి దారి వదలడం కోసం శ్రీమంతుడుని మహేష్ బాబు పోస్ట్ పోన్ చేయించడం గురించి అప్పట్లో చాలా కథనాలు వచ్చాయి. ఇది కూడా అలాంటిదే కానీ అసలు ట్విస్టులు వేరే ఉన్నాయి. ధనుష్ నటించి దర్శకత్వం వహించిన ఇడ్లీ కడాయి ఏప్రిల్ 10 విడుదలవుతుందని మూడు నెలల క్రితమే ప్రకటించారు. అయితే అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ హఠాత్తుగా అదే తేదీకి వస్తామని అనౌన్స్ చేయడంతో రెండూ క్లాష్ అవ్వడం వల్ల ఓపెనింగ్స్ ప్రభావితం చెందుతాయని బయ్యర్లు టెన్షన్ పడ్డారు.

దానికి పరిష్కారం దొరికేసింది. ఇడ్లీ కడాయిని వాయిదా వేశారు. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ త్వరలోనే క్లారిటీ ఇస్తారు. ధనుష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అజిత్ ఇంతకు ముందే అంగీకారం తెలపడం వల్లే ఈ అడ్జస్ట్ మెంట్ జరిగిందనేది చెన్నై టాక్. కానీ వాస్తవాలు వేరు. ఇడ్లీ కడాయి షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు. కొంత టాకీ పార్ట్, విదేశాల్లో షూట్ చేయాల్సిన పాట ఒకటి బాలన్స్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం కావాలట. పైగా ఇటీవలే రిలీజైన జాబిలమ్మ నీకు అంత కోపమా కోసం కొంత బ్రేక్ తీసుకున్న ధనుష్ తర్వాత బాలీవుడ్ మూవీ తేరి మేరీ ఇష్క్ సెట్స్ కు వెళ్ళిపోయాడు.

దీంతో ఏప్రిల్ 10ని ఇడ్లీ కడాయి అందుకోలేని పరిస్థితి తలెత్తింది. ఈ కారణంగానే తప్పుకోక తప్పలేదు. అంతే తప్ప అజిత్ కోసం త్యాగం చేయడం లాంటి సీన్లేమి లేవని కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే గుడ్ బ్యాడ్ అగ్లీ మీద బజ్ చూస్తుంటే దానికి కాంపిటీషన్ ఇవ్వకపోవడమే ఉత్తమం. ఇతర బాషల సంగతేమో కానీ తమిళంలో మాత్రం రికార్డులు బద్దలయ్యే ఓపెనింగ్స్ రావడం ఖాయం. ట్రైలర్ వచ్చాక ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. దానికి తగ్గట్టే మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ రిలీజ్ కు రంగం సిద్ధం చేస్తోంది. అన్నట్టు ఇడ్లీ కడాయి ఫ్రెష్ గా జూలై లేదా ఆగస్ట్ ఆప్షన్లను చూస్తోందని టాక్.