ఈ మధ్య కాలంలో భారతీయ ప్రేక్షకులను బాగా కదిలించి.. తీవ్ర భావోద్వేగానికి గురి చేసిన సినిమా అంటే.. ‘చావా’ అనే చెప్పాలి. ఈ సినిమాకు మేకింగ్ దశలో పెద్దగా హైప్ లేదు. రిలీజ్ ముంగిట కూడా ఓ మోస్తరు అంచనాలే ఉన్నాయి. కానీ ఒక్కసారి సినిమా రిలీజైందో లేదో.. రెస్పాన్స్ మాత్రం మామూలుగా లేదు. మౌత్ పబ్లిసిటీ బాగా పని చేసి సినిమాకు ప్రేక్షకులు పోటెత్తారు. నార్త్ ఇండియాలో ఈ సినిమా మామూలు సెన్సేషన్ క్రియేట్ చేయలేదు. రిలీజై మూడు వారాలు దాటినా ‘చావా’ బాక్సాఫీస్ దగ్గర జోరు కొనసాగిస్తోంది. ఐదొందల కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది.
ఈ సినిమా చూసి థియేటర్లలో తీవ్ర భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న, నినాదాలు చేస్తున్న దృశ్యాలు ఎన్నో సోషల్ మీడియాలో ఇప్పటికీ కనిపిస్తున్నాయి. అంటే పతాక సన్నివేశాలు అంతగా ప్రేక్షకులను కదిలిస్తున్నాయని అర్థం. ఐతే ‘చావా’ సినిమా పతాక సన్నివేశాల గురించి ఇంత చర్చ జరుగుతున్న సమయంలో నవీ ముంబయిలో కొందరు యువకులకు ఆ సినిమాను ఎగతాళి చేయడానికి థియేటర్‌కు వెళ్లి బుక్కపోయారు. ఓ మల్టీప్లెక్స్‌లో ‘చావా’ సినిమా చూసేందుకు వెళ్లిన ఆ యువకులు.. థియేటర్లో అందరూ తీవ్ర భావోద్వేగంతో పతాక సన్నివేశాలను చూస్తున్న సమయంలో ఎగతాళిగా నవ్వారు. వాళ్లు కావాలనే ఇలా చేశారని అర్థం చేసుకున్న మిగతా ప్రేక్షకులు ఆ యువకులకు బుద్ధి చెప్పారు.
థియేటర్ బయటికి తీసుకొచ్చి మోకాళ్ల మీద కూర్చోబెట్టి వాళ్లతో క్షమాపణ చెప్పించడంతో పాటు ‘జై శివాజీ’, ‘జై శంభాజీ’ నినాదాలు కూడా చేయించారు. అనంతరం వారిని పోలీసులకు కూడా అప్పగించినట్లు తెలుస్తోంది. ‘చావా’లోని సన్నివేశాలు చూసి అందరికీ ఉద్వేగం కలగాలని లేదు. కానీ మిగతా వాళ్ల మనోభావాలను పట్టించుకోకుండా ఎగతాళిగా నవ్వడం అంటే రెచ్చగొట్టేలా వ్యవహరించడమే. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేశారని అర్థమవుతోంది. ఈ కుర్రాళ్లకు మిగతా ప్రేక్షకులు సరిగ్గానే బుద్ధి చెప్పారంటూ సోషల్ మీడియా జనాలు కామెంట్స్ చేస్తున్నారు.
This post was last modified on March 3, 2025 3:56 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…