అక్కినేని అఖిల్‍కి ఫస్ట్ హిట్ ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బాచ్‍లర్’ అతడికి హిట్ ఇస్తుందని నమ్ముతున్నారు. అయితే ఇంతవరకు రిలీజ్ అయిన ప్రోమోలతో ఈ చిత్రం పట్ల అంచనాలు పెరగలేదు. తాజాగా విడుదలైన టీజర్‍తో అభిమానులు చాలా నిరాశ చెందారు. ఎంతో ఫన్ వుంటుందని, చాలా కొత్తగా అనిపిస్తుందని అనుకున్న టీజర్లో కనీసం డైలాగులు కూడా సరిగా లేవని కామెంట్లు పెడుతున్నారు.
‘ఇడ్లీ వడ సాంబార్’ అంటూ పూజ హెగ్డే చెప్పడాన్ని జోక్ అని డైరెక్టర్ భాస్కర్ ఫీలయినట్టున్నాడు. అందుకే టీజర్‍లో ఎండ్ పంచ్‍గా ఆ డైలాగ్ పెట్టాడు. కానీ ఈ డైలాగ్‍ని ఫాన్స్ కూడా ట్రోల్ చేస్తున్నారు. అసలే భాస్కర్ బొమ్మరిల్లు, పరుగు తర్వాత దర్శకుడిగా అసలు మెప్పించలేకపోయాడు. అతడితో సినిమా అన్నప్పుడే అభిమానులు చాలా అనుమానాలు వ్యక్తం చేసారు. ఇప్పుడు టీజర్లు కూడా ఇంత డల్‍గా కనిపించడం, అఖిల్‍లో కూడా ఎలాంటి జోష్ లేకపోవడం ఫాన్స్కి నీరసం తెప్పిస్తోంది.
ఈ టీజర్ ప్రమోషన్ కోసం అఖిల్ బిగ్‍బాస్ షోకి అతిథిగా వచ్చినా కానీ సోషల్ మీడియాలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. పూర్తిగా సమంత మాత్రమే సోషల్ మీడియాలో హైలైట్ అవడంతో అఖిల్ గెస్ట్ అప్పీయరెన్స్ మిస్‍ఫైర్ అయింది.
This post was last modified on October 26, 2020 11:08 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…