మార్కెట్ బలపరుచుకుంటూ వైవిధ్య భరిత ప్రయత్నాలు చేయాలంటే సేఫ్ జానర్ నుంచి బయటికి రావడం ఏ హీరోకైనా అవసరం. న్యాచురల్ స్టార్ నాని దాన్ని సరైన టైంలో గుర్తించాడు. ఒకప్పుడు భలే భలే మగాడివోయ్, నిన్ను కోరి, ఎంసిఏ లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో ఎక్కువగా కుటుంబ వర్గానికే దగ్గరవుతూ వచ్చిన నాని దసరాతో రూటు మార్చేశాడు. అంతకు ముందు జెండాపై కపిరాజు, కృష్ణార్జున యుద్ధం లాంటి ఒకటి రెండు ప్రయత్నాలు చేశాడు కానీ శ్రీకాంత్ ఓదెల పరిచయమయ్యాక నాని దృక్పథం పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. ఇవాళ ది ప్యారడైజ్ టీజర్ దానికి మరో సాక్ష్యం.
ఇమేజ్ ఉన్న హీరో తన సినిమాలో చేతి మీద ల*** కొడుకు అని పచ్చబొట్టు వేయించుకోవడమే కాక ఆ పదాన్ని అంత ఓపెన్ గా టీజర్ లో చెప్పించడం గతంలో ఎప్పుడూ జరగలేదు. రంగస్థలంలో శతమానంభవతి మహేష్ ఒక సీన్లో అంటాడు కానీ అది రామ్ చరణ్ ని ఉద్దేశించి కాదు. ప్యారడైజ్ లో మాత్రం నేరుగా నానికే వాడేశారు. కథ డిమాండ్ చేస్తే, దర్శకుడికి అవసరం అనుకుంటే లైన్ దాటేందుకు సిద్ధంగా ఉన్నాననే సంకేతం కూడా ఇచ్చాడు. అంతేకాదు రెండు జెడలు వేసుకుని సినిమా మొత్తం అదే గెటప్ లో కనిపించే సాహసం చేయడం గతంలో చూడనిదే. ఒక రకంగా చెప్పాలంటే ది ప్యారడైజ్ పరిచయం లేని కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతున్నట్టే.
ఇది ఒక కోణం కాగా నాని లాంటి క్లీన్ హీరో ఇంత రా సబ్జెక్టు ఎందుకు ఎంచుకున్నాడనే దాని మీద కామెంట్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో విమర్శలు వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అయినా సరే నాని రూల్స్ మార్చుకోవడానికే సిద్ధపడ్డాడు. ది ప్యారడైజ్ బడ్జెట్ పరంగా పెద్ద స్కేల్ తో రూపొందుతోంది. వంద కోట్లకు పైగానే కావొచ్చని ప్రాధమిక అంచనా. మరి ఇంత భారీగా తీస్తున్నప్పుడు కొంత పట్టువిడుపులు అవసరమే. వచ్చే ఏడాది మార్చిలో విడుదల కాబోతున్న ఈ వయొలెంట్ డ్రామా నుంచి ప్రమోషన్ పరంగా ఇంకా ఎలాంటి షాకింగ్ కంటెంట్ వస్తుందో చూడాలి. హిట్ 3 ది థర్డ్ కేస్ లోనూ హింస గట్టిగానే ఉంది.
This post was last modified on March 3, 2025 12:52 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…