Movie News

సుడల్ 2 రిపోర్ట్ ఏంటి

వెబ్ సిరీస్ లకు కొనసాగంపులు ఉండటం కొత్త కాదు కానీ ప్రతిదానికి క్రేజ్ రాదు. హైప్ తెచ్చుకునేవి ప్రత్యేకంగా కొన్ని ఉంటాయి. వాటిలో సుడల్ ది వోర్టెక్స్ ఓకటి. రెండేళ్ల క్రితం వచ్చిన మొదటి సీజన్ భారీ స్పందన తెచ్చుకుంది. ఒక గ్రామంలో జరిగే జాతరని నేపథ్యంగా తీసుకుని దాని చుట్టూ అల్లుకున్న క్రైమ్ డ్రామా ఆడియన్స్ కి మంచి థ్రిల్ ఇచ్చింది. ఐశ్యర్య రాజేష్, శ్రేయ రెడ్డి, కథిర్ లాంటి క్యాస్టింగ్ కంటెంట్ మరింత రీచ్ కావటానికి ఉపయోగపడింది. అందుకే సీజన్ 2 మీద అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి భాగంలో నటించిన ప్రధాన తారాగణంతో పాటు ఈసారి కొత్త పాత్రలను చాలా తీసుకొచ్చారు. ఇంతకీ రిపోర్ట్ ఏంటో చూద్దాం.

చెల్లి హత్యకు ప్రతీకారం తీర్చుకున్న నందిని (ఐశ్వర్య రాజేష్) జైలుకు వచ్చాక ఆమె తరఫున వాదిస్తున్న లాయర్ చెల్లప్ప (లాల్) అతని స్వంత కాటేజీలో దారుణంగా హత్యకు గురవుతాడు. సస్పెన్షన్ లో ఉన్నా దాని విచారణ బాధ్యతలు ఎస్ఐ చక్రి (కథిర్) కి ఆ బాధ్యతలు అప్పజెబుతారు అధికారులు. అయితే చెల్లప్పను తామే హత్య చేశామంటూ వేర్వేరుగా మొత్తం ఎనిమిది మంది అమ్మాయిలు పోలీస్ స్టేషన్లకు వచ్చి లొంగిపోతారు. దీంతో కేసు మరింత సంక్లిష్టంగా మారుతుంది. ఇంతకీ చెల్లప్ప హంతకులు ఎవరు, గ్రామంలో జరిగే ఉత్సావాలకు ఈ ఘటనకు సంబంధం ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానం సిరీస్ లో చూడాలి.

విక్రమ్ వేదా దర్శకులు పుష్కర్ గాయత్రి సృష్టించిన సుడల్ 2కి బ్రహ్మ – సర్జన్ డైరెక్షన్ చేశారు. గ్రిప్పింగ్, కంటెంట్ పరంగా మొదటి భాగమంత డెప్త్ లేకపోయినా ఓ మోస్తరుగా మెప్పించడంలో ఈ సీక్వెల్ పర్వాలేదనిపిస్తుంది. చెల్లప్ప హత్య జరిగాక కథనం కొంచెం నెమ్మదిగా సాగుతూ ట్విస్టులు పెద్దగా లేకపోవడం వల్ల ఫ్లాట్ గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. మరీ విసుగు రాకుండా మేనేజ్ చేయడం వల్ల ఓకే అనిపిస్తుంది. సామ్ సిఎస్ లాంటి టాప్ టెక్నీషియన్లతో పాటు భారీ నిర్మాణ విలువలు, తారాగణం వన్ టైం వాచ్ గా మార్చాయి. తీరిక ఎక్కువగా ఉండి ట్రై చేస్తే మరీ నిరాశపరచకుండా సుడల్ 2 యావరేజ్ అనిపించుకుంటుంది.

This post was last modified on March 2, 2025 3:35 pm

Share
Show comments
Published by
Satya
Tags: Suzhal 2

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

3 hours ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

3 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

5 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

10 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

10 hours ago