Movie News

కన్నప్ప…లెక్క మారిపోయిందప్పా

మంచు విష్ణు కన్నప్ప కొత్త టీజర్ వచ్చేసింది. ఇప్పటిదాకా ప్రమోషన్ల పరంగా అంత హైప్ తీసుకురాలేదనే కామెంట్స్ కి సమాధానం ఇచ్చేలా టీమ్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ 84 సెకండ్ల వీడియోలో కనిపించింది. దేవుడంటే నమ్మకం లేని తిన్నడు (మంచు విష్ణు) అమ్మవారి విగ్రహాన్ని సైతం రాయిగా భావిస్తాడు. అడవి గూడెంలో నివసించే అతని జనాల పైకి శత్రువులు దాడి చేసినప్పుడు ఒక్కడే అడ్డుగా నిలబడి తరిమి కొడతాడు. అయితే ఇంత విరుద్ధ భావాలు కలిగిన తిన్నడు కన్నప్పగా ఎలా మారాడు, లయకారకుడు శివుడు (అక్షయ్ కుమార్) ని ఎలా ప్రసన్నం చేసుకున్నాడనేది ఏప్రిల్ 25 థియేటర్లో చూడాలి.

ఈసారి క్యాస్టింగ్ మొత్తాన్ని ఒక పద్ధతి ప్రకారం రివీల్ చేశారు. మంచు విష్ణు, మోహన్ బాబు, శరత్ కుమార్, ముఖేష్ ఋషి, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, ఐశ్వర్య భాస్కరన్ తదితరులతో పాటు చివరి షాట్ లో ప్రభాస్ మొహాన్ని చూపించిన వైనం అసలు హైలైట్ గా నిలిచింది. షెల్డన్ ఛావ్ ఛాయాగ్రహణం, స్టీఫెన్ దేవస్సి నేపధ్య సంగీతం సాంకేతికంగా ఎలివేట్ చేయడానికి ఉపయోగపడ్డాయి. కథ పరంగా దాచడానికి అవకాశం తక్కువ కాబట్టి కన్నప్ప టీమ్ విజువల్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టింది. అడవి సెటప్, కోయదుస్తుల్లో తారాగణం, యుద్దాలు వగైరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

రెండో టీజర్ తో కన్నప్ప లెక్క మారిపోయిందని చెప్పాలి. ఎక్స్ ట్రాడినరి అనకపోయినా ట్రైలర్ కు ముందు బజ్ కోసం సరిపడా కంటెంట్ ఇచ్చేసింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ డివోషనల్ డ్రామాకు సుమారు వంద కోట్లకు పైగా బడ్జెట్ అయ్యిందని ఇన్ సైడ్ టాక్. బిజినెస్ లో ప్రభాస్ పాత్ర ఎంత కీలకం కానుందో ఇప్పుడీ టీజర్ ని శాంపిల్ గా చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 25 విడుదల కాబోతున్న కన్నప్పని కెరీర్ బెస్ట్ గా చేసేందుకు విష్ణు చాలా కష్టపడ్డాడు. స్టార్ క్యాస్టింగ్ ని అతి కష్టం మీద ఒప్పించాడు. ఎప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం కృష్ణంరాజు గారు చేశాక కన్నప్ప మీద వస్తున్న సినిమా ఇదే.

Kumar

Recent Posts

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

1 hour ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

2 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

2 hours ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

4 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

7 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

12 hours ago