మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న భారీ ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప ప్రమోషన్లలో వేగం పెంచారు. నిన్న ముంబైలో జరిగిన టీజర్ లాంచ్ బాగానే జరిగింది. కానీ బజ్ విషయంలో కన్నప్ప గేరు మార్చాల్సిన టైం వచ్చేసిందని చెప్పాలి. ఎందుకంటే విడుదల తేదీ ఏప్రిల్ 25 కి ఇంకో 45 రోజుల టైం మాత్రమే ఉంది. పోస్ట్ ప్రొడక్షన్, ట్రైలర్ లాంచ్, ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, మీడియా ఇంటరాక్షన్లు అన్నీ ఇందులోనే అయిపోవాలి. ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ క్యామియో చేస్తే ఈపాటికి అంచనాలు ఆకాశాన్ని దాటాలి. కానీ పబ్లిసిటీ కంటెంట్ లో ఆశించిన క్వాలిటీ లేకపోవడం వల్లే హైప్ రావడం లేదన్నది ఓపెన్ కామెంట్.
దీని మీద విష్ణు దృష్టి పెట్టాలి. ఎంత భక్తి భరిత సినిమా అయినప్పటికీ కన్నప్పలో ఆబాలగోపాలాన్ని అలరించే అంశాలకు కొదవ లేదు. వాటిని సరైన రీతిలో ప్రేక్షకుల మెదళ్లలో రిజిస్టర్ చేయాలి. కథ రివీల్ అవుతుందేమోననే భయం అక్కర్లేదు. ఎందుకంటే కన్నప్పది అందరికీ తెలిసిన గాథే. కృష్ణంరాజుగారి భక్త కన్నప్ప చూసినా ఆయన గొప్పదనం గురించి పూర్తి అవగాహన వచ్చేస్తుంది. అలాంటప్పుడు స్టోరీ లీక్స్ లాంటి ఇబ్బంది లేదు. పైగా పాత వెర్షన్ లో లేని చాలా మార్పులు ఇందులో పొందుపరిచామని విష్ణు పలు సందర్భాల్లో చెబుతూ వచ్చాడు. సో కొత్తగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్ లాంటి దిగ్గజాలు నటించిన కన్నప్పకు నార్త్ మార్కెట్ చాలా ముఖ్యం. అసలే ఈ ఏడాది కుంభమేళా జరిగింది. జనాలు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నారు. కన్నప్ప లాంటి సినిమాలకు ఇదే మంచి టైం. ఆడియన్స్ మూడ్ ని సరిగ్గా కనెక్ట్ చేసుకోగలిగితే థియేటర్లకు వచ్చేస్తారు. కానీ అది ఉందనే సంగతి వాళ్లకు ప్రమోషన్ల ద్వారా తెలియపరచాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేయాలనే దాని మీద విష్ణు టీమ్ తర్జనభర్జన పడుతోందట. పుష్ప 2 తరహాలో ఎక్కడ చేసినా భారీ రీచ్ వచ్చేలా పలు ఆప్షన్లు చూస్తున్నారని సమాచారం. ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది.
This post was last modified on February 28, 2025 9:32 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…