Movie News

నో చెప్పిన త‌మ‌న్… తిట్టిన శంక‌ర్

ప్ర‌స్తుతం సౌత్ ఇండియా అనే కాక‌, ఇండియా మొత్తంలో బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌లో త‌మ‌న్ ఒక‌డు. ఐతే త‌మ‌న్ మ‌న ప్రేక్ష‌కుల‌కు ముందు సంగీత ద‌ర్శ‌కుడిగా కంటే న‌టుడిగా ప‌రిచ‌యం. అత‌ను శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన క్రేజీ మూవీ బాయ్స్‌లో లీడ్ యాక్ట‌ర్స్‌లో ఒక‌టిగా నటించిన సంగ‌తి తెలిసిందే. అందులో అత‌డి కామెడీ బాగానే పండింది. కానీ త‌మ‌న్ త‌ర్వాత న‌టుడిగా క‌నిపించ‌లేదు. అలా అని అత‌డికేమీ అవ‌కాశాలు ఆగిపోలేదు. బోలెడ‌న్ని ఛాన్సులు వ‌చ్చాయ‌ట‌. 7-జి బృందావ‌న కాల‌నీ స‌హా ప‌లు చిత్రాల్లో అవ‌కాశాలు వ‌చ్చినా త‌మ‌న్ న‌టించ‌లేద‌ట‌. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు శంక‌ర్ త‌న‌ను తిట్టిన‌ట్లు ఓ ఇంట‌ర్వ్యూలో త‌మ‌న్ వెల్ల‌డించాడు.

సంగీత ద‌ర్శ‌కుడిగా స్థిర‌ప‌డాల‌న్న ఉద్దేశంతోనే న‌టుడిగా అవ‌కాశాలను వ‌దులుకున్న‌ట్లు తమ‌న్ తెలిపాడు. బాయ్స్ సినిమా త‌ర్వాత నాకు చాలా ఛాన్సులు వ‌చ్చాయి. 7-జి బృందావ‌న కాల‌నీ కోసం అడిగారు. ఇంకా విజ‌య్, సూర్య‌.. ఇలా పెద్ద పెద్ద స్టార్ల సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చాయి. కానీ వేటినీ నేను ఒప్పుకోలేదు. ఇది తెలిసి శంక‌ర్ గారు ఫోన్ చేసి తిట్టారు. నీకు మంచి బ్రేక్ ఇస్తే.. అన్ని ఛాన్సులు వ‌చ్చినా ఎందుకు వ‌దిలేస్తున్నావు అని అడిగారు. నేను 25 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చేస‌రికి సంగీత ద‌ర్శ‌కుడు కావాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాను.

న‌టుడిగా సినిమాలు ఒప్పుకుంటే నా ల‌క్ష్యం నెర‌వేర‌దు అనిపించింది. నా ఫోక‌స్ మ్యూజిక్ మీదే ఉండాల‌నుకున్నా. బాయ్స్ సినిమా చేయ‌డానికి కూడా కార‌ణం ఉంది. అది శంక‌ర్, ఏఆర్ రెహ‌మాన్, ఏఎం ర‌త్నం లాంటి లెజెండ్స్ క‌లిసి చేసిన సినిమా. అలాంటి గొప్ప వాళ్ల‌తో క‌లిసి ప‌ని చేస్తే సంగీత ద‌ర్శ‌కుడిగా నా కెరీర్‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అనుకున్నా. అంతే త‌ప్ప న‌ట‌న‌లో కొన‌సాగాల‌ని అనుకోలేదు అని త‌మ‌న్ తెలిపాడు. ఈ సంద‌ర్భంగా బాయ్స్ సినిమాకు అత్య‌ధిక పారితోష‌కం అందుకుంది తానే అని.. హీరో సిద్దార్థ్ కంటే త‌న‌కే ఎక్కువ రెమ్యూన‌రేష‌న్ ఇచ్చార‌ని త‌మ‌న్ వెల్ల‌డించాడు.

This post was last modified on February 28, 2025 7:44 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

31 minutes ago

నా పేరెంట్స్ మీటింగ్ కోసం మా నాన్న ఎప్పుడూ రాలేదు – లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

42 minutes ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

2 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

2 hours ago

నందమూరి ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం

‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…

2 hours ago

అమెరికా కొంటే తప్పులేదు.. భారత్ కొంటే తప్పా?

ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…

2 hours ago