గత మూడు నాలుగు నెలలుగా ఇండస్ట్రీని తీవ్రంగా పట్టి పీడిస్తున్న హెచ్డి పైరసీ రోజురోజుకు పేట్రేగిపోతోంది తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు. తాజాగా మూడో వారంలో అడుగు పెట్టిన ఛావా 4K ప్రింట్ ఆన్ లైన్లో లీకైపోవడం బయ్యర్లలో ఆందోళన రేపుతోంది. నాలుగు వందల కోట్లు దాటేసి అర సహస్రం వైపు పరుగులు పెడుతున్న ఈ బ్లాక్ బస్టర్ కనీసం ఇంకో నెల రోజులు బలమైన థియేటర్ రన్ దక్కించుకుంటుందని బయ్యర్ వర్గాలు అంచనా వేశాయి. కానీ ఇప్పుడీ క్వాలిటీ లీక్ వల్ల వసూళ్లు తీవ్రంగా ప్రభావితం చెందబోతున్నాయి. ఇదే సమస్య గేమ్ ఛేంజర్, తండేల్, డాకు మహారాజ్ కు సైతం వచ్చింది.
ఇవి తెలుగు సినిమాలు కాబట్టి సమస్యని తీవ్రంగా తీసుకోకపోయి ఉండొచ్చు. కానీ ఛావా అలా కాదుగా. సో ఇకనైనా పెద్దలు మేల్కోవాల్సిన టైం వచ్చింది. ప్రభుత్వం, పరిశ్రమ రెండు వైపులా దీన్ని అణిచివేసే దిశగా అడుగులు పడాలి. ఆ మధ్య నిర్మాత బన్నీ వాస్ తండేల్ పైరసీ చేసిన వాళ్ళ మీద తీవ్ర చర్యలుంటాయని ప్రకటించారు కానీ అవేవి ఆశించిన ఫలితం ఇచ్చినట్టు లేవు. ఈ భూతాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళకు భయం కలిగేలా చట్టపరంగా ఏదైనా చేయూత ఉంటే తప్ప ఏం చేయలేమని ప్రొడ్యూసర్లు భావిస్తున్న తరుణంలో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక చాలా అవసరం. దానికి ఎవరు చొరవ తీసుకుంటారనేది ముఖ్యం.
మొదటి రోజు కెమెరా ప్రింట్లు బయటికి రావడం ఎప్పటి నుంచో ఉన్నదే. దాని వల్ల అంతగా ముప్పు లేదని భావించి ఇండస్ట్రీ మరీ సీరియస్ గా తీసుకోలేదు. కానీ హెచ్డి పైరసీని అంత ఆషామాషీగా తీసుకోవడానికి లేదు. ముఖ్యంగా ఛావా లాంటివి ఇతర భాషల్లో డబ్బింగ్ చేసుకుని వెళుతున్న తరుణంలో ఈ పరిణామాలు ఖచ్చితంగా ఫలితాలను ప్రభావితం చేస్తాయి. విదేశాల్లో ఉన్న నేరస్థులను టెక్నాలజీ వాడి పసిగట్టే వ్యవస్థ ఉన్న రోజుల్లో పైరసీ మూలం అంతు చిక్కకపోవడం రహస్యమే. వీలైనంత త్వరగా ఈ మహమ్మారికి మందు కనుక్కోవాలి. లేదంటే భవిష్యత్ ప్యాన్ ఇండియా సినిమాలకూ ఈ జబ్బు పాకుతుంది.
This post was last modified on February 27, 2025 4:49 pm
మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి…
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్‌సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…