ఇండస్ట్రీలో ఎందరో దర్శకులు పలుమార్లు వివాదాల్లో చిక్కుకోవడం చూశాం కానీ రాజమౌళి పేరు ఎప్పుడూ ఉండేది కాదు. వందల వేల కోట్లు వసూలు చేసే సినిమాలు తీసినా సరే కాంట్రవర్సీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆర్ఆర్ఆర్ టైంలో సీతారామరాజు, భీం పాత్రల మీద పలు ఇష్యూలు తలెత్తినా కూల్ గా మేనేజ్ చేశారు. కానీ తాజాగా ఆయన స్నేహితుడిగా చెబుతున్న ఉప్పలపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి జక్కన్న మీద తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది. తన చావుకు కారణం రాజమౌళినే అంటూ పేర్కొంటూ, తప్పు చేశాడో లేదో తెలియాలంటే లై డిటెక్టర్ పరీక్ష చేయాలంటూ మరణ వాంగ్మూలం ఇవ్వడం షాక్ కలిగిస్తోంది.
అయిదు నిమిషాలకు దగ్గరగా ఉన్న వీడియోలో శ్రీనివాసరావు స్వయంగా చెప్పిన ప్రకారం వీళ్ళ స్నేహం 90 దశకంలో శాంతినివాసం సీరియల్ కు ముందు నుంచే ఉంది. అప్పటికింకా కెరీర్ ప్రారంభంలోనే ఉంది. ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించాక రాజమౌళి కోసం శ్రీనివాసరావు త్యాగం చేసి ఒంటరిగా మిగిలిపోయారట. ఇప్పుడా మహిళా గురించి నేను ఎక్కడైనా చెప్పానేమో అనే అనుమానంతో నిత్యం తనను వేధిస్తున్నారని అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి తన దగ్గర ఆధారాలు లేవని చెబుతున్న శ్రీనివాసరావు యమదొంగ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేసి ఉండటం గమనార్హం. ఈయన వయసు 55.
ప్రస్తుతానికి రాజమౌళి టీమ్ నుంచి దీనికి సంబంధించి ఎలాంటి స్పందన లేదు. శ్రీనివాసరావు నిజంగా ఏదైనా అఘాయిత్యం చేసుకున్నది లేనిది కూడా పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఇవి ఎంత వరకు నిజమో ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ స్పష్టత రావు. చాలా సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి శ్రీదేవి తన భార్య అంటూ నానా యాగీ చేసి జాతీయ మీడియాలో హైలైట్ అయ్యాడు. మరి ఇప్పుడు రాజమౌళి మీద చేస్తున్న ఆరోపణలు అదే కోవలోకి వస్తాయా లేక నిజంగా ఏమైనా తెరవెనుక జరిగిందా అనేది వేచి చూస్తే తప్ప క్లారిటీ రాదు. సదరు స్నేహితుడు వీడియోలో ఆ మహిళ పేరు ప్రస్తావించకపోవడం ఫైనల్ ట్విస్ట్.
This post was last modified on February 27, 2025 4:14 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…