Movie News

షాకింగ్.. బాండ్ సినిమా థియేట‌ర్ల‌లోకి రాద‌ట‌

క‌రోనా దెబ్బ థియేట‌ర్ల‌పై మామూలుగా ప‌డ‌లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా నెల‌ల త‌ర‌బ‌డి థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. ఇండియా స‌హా చాలా దేశాల్లో ఇప్ప‌టికీ మెజారిటీ థియేట‌ర్లు తెరుచుకోలేదు. పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడతాయన్న ఆశలేమీ కనిపించడం లేదు. దీంతో ఓటీటీల జోరు యధావిధిగా కొనసాగుతోంది. థియేటర్ల పున:ప్రారంభానికి అనుమతులు లభించాక ఓటీటీల రిలీజ్‌ల సంఖ్య మరింత పెరగడం గమనార్హం. ఇది ఇండియాలో మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న ఒరవడి.

కొన్ని నెలల కిందటి వరకు ఎక్కువగా చిన్న సినిమాలే ఓటీటీల్లోకి వచ్చేవి కానీ.. ఈ మధ్య భారీ సినిమాలు కూడా వరుస కట్టేస్తున్నాయి. తమిళ, తెలుగు భాషల్లో సూర్య సినిమా ‘సూరారై పొట్రు’.. హిందీలో ‘లక్ష్మీబాంబ్’ లాంటి భారీ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. ఇదిలా ఉండగా.. ఓ భారీ హాలీవుడ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోందన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి.

ఆ సినిమానే.. నో టైమ్ టు డైం. జేమ్స్ బాండ్ సిరీస్‌లో రాబోతున్న కొత్త చిత్రమిది. డేనియెల్ క్రెయిగ్ ఇందులో బాండ్ పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా వచ్చి అడ్డం పడింది. నవంబరుకు రిలీజ్ డేట్ మార్చినా ఫలితం లేకపోయింది. పరిస్థితులు మెరుగపడలేదు. ఈ మధ్యే మరోసారి సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 2కు కొత్త డేట్ ఇచ్చారు. దానికి అందరూ ఫిక్సయి ఉండగా.. ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకునేందుకు యాపిల్ టీవీ, నెట్ ఫ్లిక్స్ లాంటి పెద్ద సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇందుకోసం రూ.4 వేల కోట్లకు పైగానే ఖర్చు చేయడానికి ముందుకొచ్చాయి. ఐతే మామూలు రోజుల్లో అయితే బాండ్ సినిమాకు మంచి టాక్ వస్తే ఈజీగా ఆరేడు వేల కోట్ల రూపాయలు వసూలవుతాయి. కానీ నోలన్ సినిమా ‘టెనెట్’ ఫలితం చూశాక థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూడటం కన్నా పెట్టుబడి మీద కొంత లాభానికి ఓటీటీకి అమ్మేయడం మేలన్న అభిప్రాయానికి నిర్మాతలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే మాత్రం ప్రపంచ సినీ రంగంలో ఓ సంచలనం అయ్యే అవకాశముంది.

This post was last modified on October 25, 2020 8:12 am

Share

Recent Posts

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

8 minutes ago

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

50 minutes ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

1 hour ago

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

1 hour ago

దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడా?

షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…

2 hours ago

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

2 hours ago