బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సునామిలా విరుచుకుపడిన చావా ఇప్పటికే మూడు వందల కోట్ల మార్కుని దాటేసి అయిదు వందల వైపు పరుగులు పెడుతోంది. ఇంకో వారంలోపే ఆ లాంఛనం పూర్తయ్యేలా ఉంది. అయితే దీని డబ్బింగ్ వెర్షన్ల కోసం ప్రేక్షకుల నుంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటిదాకా ఆ దిశగా నిర్మాణ సంస్థ చొరవ తీసుకోకపోవడం అసంతృప్తిని కలిగించింది. ఫైనల్ గా వాళ్ళ కోరికను తీరుస్తూ మార్చి 7 తెలుగు డబ్బింగ్ ని గీతా ఆర్ట్స్ ద్వారా రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. గతంలో కాంతారని పంపిణి చేసింది ఈ సంస్థే. కాబట్టి థియేటర్ కౌంట్ పరంగా మంచి నెంబర్ దక్కబోతోంది.
మూడో వారంలో అనువాదమంటే వసూళ్లు మరీ భారీగా ఆశించలేం కానీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఎందుకంటే గతంలో ఇలాంటి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సైరా, గౌతమిపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి లాంటివి విజయం సాధించాయి కానీ రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో కాదు. పైగా అవి తెలుగు వీరుల గాథలే అయినా మన పబ్లిక్ కి అంతగా ఎక్కలేదు. మరి మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ కథని చూస్తారా అంటే చెప్పలేం. ఇప్పటికే ఒరిజినల్ వెర్షన్ తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆడింది. కీలక కేంద్రాల్లో పెద్ద ఎత్తున కలెక్షన్లు వచ్చాయి.
చావా తెలుగు వెర్షన్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెబుతాడనే పుకారు పుట్టినది కానీ అందులో ఏ మాత్రం నిజం లేదు. కాకపోతే రష్మిక మందన్న స్వంతంగా చెప్పుకుంటుందో లేదో చూడాలి. ఇప్పటికీ బుకింగ్స్ పరంగా జోరుగా ఉన్న చావా పదమూడో రోజు సైతం గంటకు ముప్పై వేలకు పైగా టికెట్లు అమ్ముతూ టాప్ ట్రెండింగ్ లో ఉంది. మంచి టాక్ వచ్చినా ఇతర బాషల కొత్త రిలీజులు ఎన్ని ఉన్నా చావానే టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. విక్కీ కౌశల్ ని స్టార్ లీగ్ లోకి తీసుకెళ్లిన చావా మనోళ్లకు ఎలా కనెక్ట్ అవ్వబోతోందో చూడాలి.
This post was last modified on February 27, 2025 7:43 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…