Movie News

సూర్య సినిమాకు అడ్డంకి తొలగిపోయింది

సౌత్ ఇండియాలో ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన అతి పెద్ద సినిమా అంటే.. ‘ఆకాశం నీ హద్దురా’నే. తమిళంలో ‘సూరారై పొట్రు’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య కథానాయకుడిగా నటించగా.. తెలుగమ్మాయి సుధ కొంగర డైరెక్ట్ చేసింది. ఎయిర్ డెక్కన్ ఎయిర్ లైన్స్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఈ నెల 30న అమేజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా రిలీజ్ కావాల్సింది.

ఐతే ఈ సినిమాకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ల నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) రాకపోవడంతో సినిమాను వాయిదా వేస్తున్నట్లు సూర్య ఇటీవలే ప్రకటించాడు. సినిమా తెరకెక్కింది ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో అన్న సంగతి తెలిసిందే. ఐతే ఈ మధ్యే విడుదలైన జాన్వి కపూర్ సినిమా ‘గుంజన్ సక్సేనా’లో ఎయిర్ ఫోర్స్ అధికారులను నెగెటివ్‌గా చూపించిన నేపథ్యంలో సూర్య సినిమా మీద ప్రత్యేకంగా దృష్టిసారించారు. దీంతో ఎన్వోసీ జారీ చేయడంలో ఆలస్యం జరిగింది. అందుకే విడుదల వాయిదా పడింది.

ఐతే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఎయిర్ ఫోర్స్ నుంచి ఎన్వోసీ వచ్చేసిందట. సినిమా విడుదలకు ఇక అడ్డంకులు తొలగిపోయినట్లే. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో రెడీగా ఉందీత చిత్రం. మరి యథాప్రకారం అక్టోబరు 30న సినిమాను విడుదల చేస్తారా లేదా అన్నది మాత్రం తెలియడం లేదు. సూర్య ఆలోచన ఇప్పుడు వేరుగా ఉందని.. తమిళులకు అతి పెద్ద పండుగల్లో ఒకటైన దీపావళిని పురస్కరించుకుని నవంబరు రెండో వారంలో ఈ సినిమాను రిలీజ్ చేద్దామా అని యోచిస్తున్నాడని అంటున్నారు.

ఆ సమయానికే విశాల్ సినిమా ‘చక్ర’ కూడా ఓటీటీ రిలీజ్‌కు సన్నద్ధమవుతోంది. హిందీ చిత్రం ‘లక్ష్మీ బాంబ్’ కూడా అప్పుడే విడుదలవుతుంది. మరి వాటితో పోటీ ఉన్నప్పటికీ పండుగ రిలీజే మంచిదనుకుంటాడా.. లేక ఇప్పుడు సోలో రిలీజ్‌కు రెడీ అవుతాడా అన్నది చూడాలి. ఈ చిత్రాన్ని స్వయంగా సూర్యనే నిర్మించిన సంగతి తెలిసిందే.

This post was last modified on October 24, 2020 1:04 pm

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

22 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago