ఇండియాలోని సినిమా హీరోల్లో ఎవరికీ లేని ప్రత్యేకత తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్‌కు ఉంది. ఆయన ప్రొఫెషనల్ మోటార్ స్పోర్ట్స్ డ్రైవర్. ఇప్పటికే ఎన్నో బైక్, కార్ రేసుల్లో పాల్గొన్న అజిత్.. అద్భుత విన్యాసాలతో ఆశ్చర్యపరిచాడు. ఇటీవల ఒక పెద్ద రేసులో మూడో స్థానం సంపాదించాడు కూడా. సినిమాల నుంచి ఏమాత్రం ఖాళీ దొరికినా అజిత్.. రేసులకు వెళ్లిపోతుంటాడు. ఐతే ఇటీవల ఆయన ఒక పెద్ద ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డాడు. అప్పుడు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు మరోసారి అజిత్ ప్రమాదానికి గురయ్యాడు.
స్పెయిన్‌లోని వాలెన్సియాలో జరిగిన పోర్షే కార్ రేసులో అజిత్ తన ప్రమేయం లేకుండా జరిగిన యాక్సిడెంట్‌లో పెను ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డాడు. అజిత్ కారులోని కెమెరాలో రికార్డ్ అయిన ఈ యాక్సిడెంట్ అభిమానులను చాలా టెన్షన్ పడేలా చేస్తోంది. అజిత్ రేసులో దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా.. ముందున్న కారు ఒక చోట అదుపు తప్పి తన కారుకు అడ్డంగా రావడం.. దాన్ని ఎడ్జ్‌లో ఢీకొట్టిన అజిత్ కారు.. రెండుసార్లు పల్టీ కొట్టడం.. ఇదంతా కెమెరాలో రికార్డయింది. కారు స్పీడు.. ఆ ప్రమాదం జరిగిన తీరు చూసి అజిత్ అభిమానులు చాలా కంగారు పడిపోతున్నారు. తమ హీరో చేస్తున్నది మామూలు సాహసం కాదని వాళ్లకు అర్థమవుతోంది.
అదృష్టవశాత్తూ కారులో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ వల్ల అజిత్ గాయపడకుండా బయటికి వచ్చాడు. కానీ ఇలాంటి ప్రమాదాల్లో కొన్నిసార్లు డ్రైవర్లు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంటుంది. క్రాష్ జరిగినపుడు కార్లు పేలిపోవడం, కాలిపోవడం జరుగుతుంటుంది. కొన్నిసార్లు కారు బాగా డ్యామేజ్ అయి డ్రైవర్లు వాటిలో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడడం, ప్రాణాలు కోల్పోవడం చూస్తుంటాం. కాబట్టి అజిత్ ఏ గాయాలు లేకుండా బయటపడడం అదృష్టం అనే చెప్పాలి. ఈ వీడియో చూశాక అజిత్ ఇకపై ఈ రేసులు మానేయాలని కోరుతూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో.
This post was last modified on February 23, 2025 3:25 pm
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. శుక్రవారం నుంచి…
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…