నిన్న రాత్రే భారీ అంచనాల మధ్య అమేజాన్ ప్రైమ్‌లో రిలీజైంది ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ రెండో సీజన్. రెండేళ్ల కిందట పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ‘మీర్జాపూర్’.. బోల్డ్ యాక్షన్ సిరీస్‌లను ఇష్టపడేవారిని అమితంగా ఆకట్టుకుంది. అందులో వయొలెన్స్, రొమాన్స్, డైలాగ్స్ అన్నీ కూడా చాలా నాటుగా, బోల్డ్‌గా ఉండి ఆ వర్గం ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. దీనికి కొనసాగింపుగా తీసిన సిరీస్ మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. విజయదశమి కానుకగా కొత్త సీజన్‌ను స్ట్రీమ్ చేసింది అమేజాన్.
తొలి సీజన్‌కు దీటుగానే రెండో సిరీస్ ఉందని.. మొదటిది నచ్చిన వాళ్లకు రెండోదీ నచ్చుతుందని రివ్యూలు వస్తున్నాయి. ఐతే ఈ సిరీస్ మీద సోషల్ మీడియాలో మాత్రం తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. చాలామంది నెటిజన్లు ఈ సిరీస్‌ను అమేజాన్‌లో చూడమంటూ చెప్పి మరీ పైరసీ వెర్షన్ల మీద పడటం గమనార్హం.
ఇందుక్కారణం లేకపోలేదు. ‘మీర్జాపూర్’లో కీలక పాత్ర పోషించిన అలీ ఫైజల్ గత ఏడాది కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. ఓ వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అతణ్ని యాంటీ నేషనల్‌గా అభివర్ణించారు హిందూ వాదులు. ఇక అప్పట్నుంచి అతడికి సంబంధించిన ప్రతి విషయాన్నీ బాయ్‌కాట్ చేయడం మొదలుపెట్టారు.
ఐతే సినిమాలతో పోలిస్తే ‘మీర్జాపూర్’ సిరీస్‌తోనే అలీకి ఎక్కువ పేరొచ్చింది. పైగా ‘మీర్జాపూర్’ రెండో సీజన్లో అతనే సోల్ హీరో. విక్రమా మాస్సే చేసిన అతడి తమ్ముడి పాత్ర తొలి సీజన్ చివర్లో చనిపోతుంది. రెండో సీజన్ అంతా అలీ చుట్టూనే తిరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ గురించి కొన్ని రోజుల ముందు నుంచే వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు సమయం రాగానే యాంటీస్ రెచ్చిపోతున్నారు. టెలిగ్రామ్ పైరసీ లింక్‌ను ట్విట్టర్ షేర్ చేసి మరీ పైరసీని ప్రోత్సహిస్తున్నారు. ‘నాకు మీర్జాపూర్ చాలా ఇష్టం. కానీ రెండో సీజన్‌ను పైరసీలోనే చూస్తా’ అనే టెంప్లేట్ మెసేజ్‌లు వేలమంది పోస్ట్ చేసి అలీకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుండటం, పైరసీని వ్యాప్తి చేస్తుండటం గమనార్హం.
This post was last modified on October 23, 2020 6:41 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…