ప్రభాస్ ట్రూ పాన్ ఇండియా స్టార్ అని మరోసారి రుజువైంది. శుక్రవారం ప్రభాస్ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో అతడి క్రేజ్ చూసి బాలీవుడ్ వాళ్లు కూడా అసూయ చెందే పరిస్థితి. ఈ రోజు ఉదయం ట్విట్టర్ ట్రెండ్స్ అన్నింటినీ ప్రభాసే ఆక్రమించేశాడు. #happybirthdayprabhas హ్యాష్ ట్యాగ్ నార్త్, సౌత్ అని తేడా లేకుండా అన్ని చోట్లా టాప్‌లో ట్రెండ్ అయ్యింది. ప్రభాస్ పేరుతో ముడిపడ్డ మరి కొన్ని హ్యాష్ ట్యాగ్‌లూ ట్విట్టర్లో హల్‌చల్ చేశాయి.
ఇక రాధేశ్యామ్ సినిమా నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్ కావడంతో దానికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ మీదా లక్షల్లో ట్వీట్లు పడ్డాయి. వేరే హీరోల అభిమానులు ముందు రోజు సాయంత్రం ట్రెండ్ అలెర్ట్ ఇచ్చి పనిగట్టుకుని ట్వీట్లు వేయడం, రికార్డుల కోసం కొట్టేసుకోవడం చూస్తూనే ఉంటాం. కానీ ప్రభాస్ విషయంలో ఆ అవసరం లేకుండా దేశవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులు, అభిమానులు అతడి పుట్టిన రోజును సెలబ్రేట్ చేశారు. పెద్ద ఎత్తున విషెస్ చెప్పారు.
‘బాహుబలి’తో ఒక్కసారిగా అనూహ్యమైన క్రేజ్ సంపాదించుకుని పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ప్రభాస్. ఆ సినిమా విజయంలో ప్రభాస్ ఘనతేమీ లేదని, అంతా రాజమౌళిదే క్రెడిట్ అని ప్రభాస్‌ను తేలిక చేసేవాళ్లూ లేకపోలేదు. కానీ ‘సాహో’ సినిమాకు కేవలం ప్రభాస్ పేరు మీదే వందల కోట్లు ఖర్చు పెట్టారు. అతడి పేరు మీదే బిజినెస్ జరిగింది. ఫ్లాప్ టాక్ వచ్చినా వందల కోట్లు వసూళ్లు రాబట్టింది. ఐతే అంతిమంగా ఈ సినిమా పరాజయం పాలైన నేపథ్యంలో ప్రభాస్ క్రేజ్ తగ్గి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ పుట్టిన రోజు నాడు ప్రభాస్ పేరు మార్మోగిన తీరు చూస్తే అతడిది చెక్కుచెదరని ఇమేజ్, క్రేజ్ అని అర్థమవుతుంది.
టాలీవుడ్ నుంచి కూడా సినీ ప్రముఖులందరూ తమకు నచ్చినా నచ్చకపోయినా ప్రభాస్‌ను గుర్తించి విషెస్ చెబుతున్నారంటే అతడి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ అభిమానులు కొంచెం అతి చేసి మధ్యలో అతడి మీద కొందరు హీరోల అభిమానుల్లో వ్యతిరేకత తీసుకొచ్చారు కానీ.. నిజానికి ఎంత ఎదిగినా ఒదిగినట్లుండే ప్రభాస్ అంటే అందరికీ ఇష్టమే.
This post was last modified on October 23, 2020 6:31 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…