Movie News

సంక్రాంతికి వస్తున్నాం రీమేక్ రిస్కేమో

2025 తొలి ఇండస్ట్రీ హిట్ గా మూడు వందల కోట్ల వసూళ్లను ఖాతాలో వేసుకున్న సంక్రాంతికి వస్తున్నాంని హిందీ రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిలిం నగర్ టాక్. దిల్ రాజే నిర్మాతగా అక్షయ్ కుమార్ తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని ముంబై వర్గాల కథనం. అయితే ఇక్కడో పెద్ద రిస్క్ పొంచి ఉంది. ఈ సినిమా తెలుగులో బాగా ఆడేందుకు వెంకటేష్ కామెడీ టైమింగ్ తో పాటు గోదావరి యాసలో ఐశ్యర్య రాజేష్ నటన, బుడ్డోడు రేవంత్ పెర్ఫార్మన్స్, భీమ్స్ ఇచ్చిన అదిరిపోయే పాటలు వెరసి ఇంత పెద్ద సక్సెస్ దక్కేందుకు దోహదం చేసాయి. అన్నింటి కన్నా ప్రధానంగా నేటివిటీ పని చేసింది.

ఇప్పుడు దీన్నే హిందీలో తీయాలంటే బోలెడు మార్పులు చేయాలి. అక్కడి ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు ఉండాలి. గతంలో ఎఫ్2ని బాలీవుడ్ లో తీయాలని దిల్ రాజు చాలా ప్రయత్నించారు. కానీ సరైన కాంబో కుదరక డబ్బింగ్ వెర్షన్ తో సరిపెట్టారు. ఎఫ్3కి అసలా ఆలోచనే చేయలేదు. కానీ సంక్రాంతికి వస్తున్నాంలో భాషతో సంబంధం లేకుండా కనెక్ట్ అయ్యే పాయింట్ ఉంది కాబట్టి వర్కౌట్ అవుతుందనే నమ్మకం ఉండొచ్చు. అయితే ఇలాంటి కథలు నార్త్ లో బోలెడు వచ్చాయి. వాళ్ళేం కొత్తగా ఫీలవ్వరు. అది కాకుండా అనిల్ రావిపూడిలా కామిక్ సెన్స్ ఉన్న డైరెక్టర్లు ఉత్తరాదిలో దొరకడం కష్టం.

ఇలా బోలెడు క్యాలికులేషన్లు తెరవెనుక ఉన్నాయి. ఒకప్పుడు మన రీమేకులు హిందీలో బ్రహ్మాండంగా ఆడేవి. పవిత్ర బంధంతో మొదలుపెట్టి పెళ్ళాం ఊరెళితే దాకా ఎన్నో హిట్లున్నాయి. కానీ కొంత కాలంగా ఈ మంత్రం పని చేయడం లేదు. అల వైకుంఠపురములో, జెర్సీ, హిట్ ది ఫస్ట్ కేస్, గద్దలకొండ గణేష్, సర్ఫిరా,బేబీ జాన్ లాంటివి దారుణంగా పోయాయి. అలాంటప్పుడు సంక్రాంతికి వస్తున్నాంకి పెద్ద సవాలే ఉంటుంది. పైగా త్వరలోనే ఓటిటిలో రానుంది. చూసే సంఖ్య భారీగా ఉంటుంది. మరి ఈ రీమేక్ వార్త నిజమే అయితే దర్శకుడెవరో కానీ చాలా హోమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. చూడాలి ఏం జరగనుందో.

This post was last modified on February 21, 2025 6:40 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago