Movie News

జీవీ ప్రకాష్ విడాకులకు ఆమె కారణమా?

గత కొన్నేళ్లలో దక్షిణాది సినీ పరిశ్రమలో విడాకుల వార్తలు పెరిగిపోయాయి. నాగచైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య, జయం రవి-ఆర్తి, జీవీ ప్రకాష్ కుమార్-సైంధవి.. ఇలా దక్షిణాది ఇండస్ట్రీలో విడిపోయిన జంటలు చాలానే ఉన్నాయి. వీరిలో జీవీ-సైంధవి జంట విడాకులకు తమిళ హీరోయిన్ దివ్యభారతి కారణమంటూ గత ఏడాది సోషల్ మీడియాలో ఓ ప్రచారం సాగింది. .జస్ట్ రూమర్లు రావడం వరకు మామూలే కానీ.. ఈ విషయంలో దివ్యభారతిని తిడుతూ చాలామంది ఆమెకు మెసేజ్‌లు పంపారట. చాలామంది మహిళలే తనను తిట్టినట్లు దివ్యభారతి వెల్లడించింది.

జీవీ-దివ్యభారతి గతంలో ‘బ్యాచిలర్’ అనే సినిమాలో కలిసి నటించారు. అందులో వాళ్లిద్దరి కెమిస్ట్రీ బాగా పండింది. ఇప్పుడు జీవీ-దివ్య కలిసి నటించిన ‘కింగ్ స్టన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జీవీ, దివ్యభారతి.. ఈ విషయమై మాట్లాడారు. తాను, దివ్యభారతి మంచి స్నేహితులమని, అంతకుమించి తమ మధ్య ఏమీ లేదని జీవీ ప్రకాష్ స్పష్టం చేశాడు. సినిమా సెట్స్ దాటి బయట తాము కలవనే కలవమని అతను చెప్పాడు. తనకు, సైంధవికి విడాకులు కావడానికి తనే కారణమని సోషల్ మీడియాలో నిందించడం అన్యాయమని అతనన్నాడు.

ఇక దివ్యభారతి మాట్లాడుతూ.. ‘‘నేను, జీవీ కలిసి చేసిన ‘బ్యాచిలర్’లో మా ఇద్దరి కెమిస్ట్రీకి మంచి స్పందన వచ్చింది. కానీ జీవీ, సైంధవి విడాకుల గురించి ప్రకటించినపుడు అందరూ నన్ను నిందించడం మొదలుపెట్టారు. దారుణంగా తిడుతూ మెసేస్‌లు పెట్టేవారు. విడాకుల తర్వాత కూడా జీవీ, సైంధవి కలిసి మ్యూజికల్ కన్సర్ట్ చేస్తే చాలా సంతోషించాను. ఇక ఆ మెసేజ్‌లు ఆగిపోతాయనుకున్నా. కానీ తర్వాత కూడా అవి ఆగలేదు. ఇంకా పెరిగాయి.

మహిళలే చాలామంది నన్ను తిట్టేవాళ్లు. కొన్ని మెసేజ్‌లను జీవీకి ఫార్వర్డ్ చేసేదాన్ని. కానీ ఇవేవీ పట్టించుకోకుండా కెరీర్ మీద దృష్టిపెట్టమని జీవీ చెప్పేవాడు’’ అని చెప్పింది. పని విషయంలో తాను, సైంధవి ఎంతో క్రమశిక్షణతో ఉంటామని, అందుకే విడిపోయాక కూడా కలిసి కన్సర్ట్ చేసి తాము ప్రొఫెషనల్ అని చాటామని జీవి తెలిపాడు.

This post was last modified on February 20, 2025 6:07 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

37 seconds ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

1 hour ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago