పుష్ప 2 ది రూల్ పెద్ద స్థాయిలో ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక అల్లు అర్జున్ చేయబోయే తర్వాతి సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ముందు అనుకున్న ప్రకారమైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫాంటసి ప్యాన్ ఇండియా మూవీ మొదలవ్వాలి. కానీ స్క్రిప్ట్ లాక్, ప్రీ ప్రొడక్షన్ కు మరింత సమయం పట్టేలా ఉండటంతో ఈలోగా అట్లీతో ప్రాజెక్టు పూర్తి చేయాలని బన్నీ నిర్ణయించుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. నిజానికి దీనికి సంబంధించిన వార్త ఏడాది నుంచే చక్కర్లు కొడుతోంది. జవాన్ అయిపోయిన వెంటనే అట్లీ దీని మీద పని చేస్తున్నాడు. మధ్యలో బేబీ జాన్ ప్రొడక్షన్ కోసం చిన్న బ్రేక్ తీసుకున్నాడు.
ఇప్పుడు ఫైనల్ నెరేషన్ సంతృప్తికరంగా రావడంతో సెట్స్ పైకి వెళ్లబోతోందట. హీరోయిన్ గా జాన్వీ కపూర్, సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ లాకయ్యారనే లీకులు ఆల్రెడీ చక్కర్లు కొడుతున్నాయి. కమర్షియల్ ఫార్మాట్ లో హీరోలను లార్జర్ తాన్ లైఫ్ చూపించడంలో గొప్ప నేర్పు కలిగిన అట్లీ బన్నీని ఎలా ప్రెజెంట్ చేస్తాడనేది ఆసక్తికరం. పుష్ప హ్యాంగోవర్ నుంచి పూర్తిగా బయటికి వచ్చేలా ఐకాన్ స్టార్ కోసం కొత్త తరహా క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశాడట. తమిళ తెలుగుకు సంబంధించిన పలువురు రచయితలు దీంట్లో పాలు పంచుకున్నట్టు సమాచారం. అన్నీ సవ్యంగా కుదిరితే వేసవిలోగానే మొదలుపెట్టొచ్చు.
మరి గురూజీది ఎప్పుడంటే అట్లీ సినిమా షూటింగ్ పూర్తవుతున్న దశల్లో దీన్ని లైన్ మీదకు తెస్తారు. పుష్ప 3 ఉంటుందో లేదో ఎవరికి తెలియదు కానీ ప్రస్తుతానికి అల్లు అర్జున్ కమిట్ మెంట్ ఇచ్చినవి ఈ రెండే. స్పిరిట్ కనక వేగంగా పూర్తయితే ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా వచ్చి ఐకాన్ స్టార్ తో చేతులు కలుపుతాడు. ఇది ఆల్రెడీ అఫీషియల్ గా ఫిక్స్ అయిన కాంబినేషన్. అట్లీ మీద కంటెంట్ పరంగా ఎన్ని కామెంట్లున్నా బాక్సాఫీస్ ని వందల కోట్ల వసూళ్లతో దుమ్ము దూలపడం అలవాటుగా చేసుకున్నాడు. విజయ్, షారుఖ్ ఖాన్లకు అలాగే హిట్లు ఇచ్చాడు. మరి బన్నీ ఫ్యాన్స్ వాటికి మించి ఆశిస్తారు కాబట్టి దాన్ని నెరవేర్చాలి.
This post was last modified on February 20, 2025 11:34 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…