మెగా అభిమానులకు గత కొన్నేళ్ల నుంచి చేదు అనుభవాలే మిగులుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి చివరగా వచ్చిన ‘భోళా శంకర్’ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. పవన్ కళ్యాణ్ నుంచి సినిమాలే రావడం లేదు. ఆయన చివరి చిత్రం ‘బ్రో’ నిరాశపరిచింది. వరుణ్ తేజ్ మూవీ ‘మట్కా’తో డిజాస్టర్ స్ట్రీక్‌ను కొనసాగించాడు. రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’ కూడా బాక్సాఫీస్ దగ్గర షాక్ తింది. ఈ నేపథ్యంలో మెగా హీరోలు చేస్తున్న ఫ్యూచర్ ప్రాజెక్టుల మీదే వారి ఆశలు నిలబడ్డాయి. వాటిలో మోస్ట్ ప్రామిసింగ్‌గా కనిపిస్తున్న మూవీ రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నదే అనడంలో సందేహం లేదు.
‘ఉప్పెన’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాక హడావుడి పడకుండా చరణ్ లాంటి పెద్ద స్టార్‌తో సినిమాను ఓకే చేయించుకున్నాడు బుచ్చిబాబు. ఈ కథ గురించి విజయ్ సేతుపతి, శివరాజ్ కుమార్ లాంటి వేరే ఇండస్ట్రీల స్టార్లు ఒక రేంజిలో చెప్పారు ఇప్పటికే. సుకుమార్ సైతం ఈ కథ సూపర్ అన్నాడు. బుచ్చిబాబు సైతం ఈ సినిమా గురించి ముందు నుంచి గొప్పగా మాట్లాడుతున్నాడు. తాజాగా బ్రహ్మాజీ సినిమా ‘బాపు’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వచ్చిన బుచ్చిబాబు.. చరణ్‌తో తన సినిమా గురించి రెండు ముక్కలు మాట్లాడాడు.
తన తొలి చిత్రం ‘ఉప్పెన’ థియేటర్లలో ఉండగా.. తన తండ్రి థియేటర్ బయట ఎదురు చూస్తూ సినిమా చూసిన ప్రేక్షకులను ఎలా ఉంది అంటూ అడిగేవాడని.. కానీ చరణ్‌తో తాను చేస్తున్న సినిమా గురించి మాత్రం అలా అడగాల్సిన పని లేదని బుచ్చిబాబు అన్నాడు. ఎందుకంటే ఈ సినిమా చాలా బాగుంటుందని వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్ చరణ్ అభిమానులకు ధీమానిస్తోంది. ఇతర ప్రేక్షకుల్లోనూ సినిమా పట్ల హైప్ పెంచుతోంది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలో ఆలస్యం జరిగింది. ప్రస్తుతం చిత్రీకరణ తొలి దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి లేదా వేసవికి రిలీజ్ చేసే అవకాశముంది.
This post was last modified on February 19, 2025 9:38 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…