2025 ప్రారంభంలో రెండు పవర్ ఫుల్ కంబ్యాక్స్ జరిగిపోయాయి. కొన్ని సంవత్సరాలుగా తన స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న వెంకటేష్ కు సంక్రాంతికి వస్తున్నాం రూపంలో ఒకటి రెండు కాదు ఏకంగా మూడు వందల కోట్ల ఇండస్ట్రీ హిట్ దక్కింది. మాస్ కోసం తీసిన డాకు మహారాజ్ ని డామినేట్ చేసి మరీ ఈ ఫిగర్ సాధించడం చిన్న విషయం కాదు. ఇక దగ్గుబాటి అభిమానుల సంతోషం గురించి చెప్పేదేముంది. ఏకంగా వాల్తేరు వీరయ్యని సవాల్ చేసే రేంజ్ లో వసూళ్లు నమోదు కావడం కొన్ని సంవత్సరాలు చెప్పుకుంటారు. దీని దెబ్బకే వెంకటేష్ తర్వాతి సినిమా విషయంలో తొందరపాటు చూపించడం లేదు.
ఈ నెలలో నాగచైతన్య కోటా పూర్తయిపోయింది. కస్టడీ, థాంక్ యు లాంటి పూర్ డిజాస్టర్స్ నుంచి పూర్తిగా కోలుకునేలా తండేల్ ఫుల్ కిక్ ఇచ్చేసింది. పది రోజుల తిరక్కుండానే వంద కోట్లు వచ్చేసినట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. లెక్కల సంగతి పక్కనపెడితే చైతు హిట్ దాహాన్ని తండేల్ తీర్చిన మాట వాస్తవం. ఇక నెక్స్ట్ అందరి చూపు రవితేజ వైపు వెళ్తోంది. ధమాకా తర్వాత సోలో హీరోగా మాస్ మహారాజా హిట్టు కొట్టలేదు. రావణాసురతో మొదలుపెట్టి మిస్టర్ బచ్చన్ దాకా దాదాపు అన్నీ లాస్ వెంచర్లే. అందుకే సితార నిర్మాణంలో రూపొందుతున్న మాస్ జాతర మీద ఫ్యాన్స్ బోలెడు నమ్మకం పెట్టుకున్నారు.
భాను భోగవరపు దర్శకుడిగా కొత్తవాడే కానీ రచయితగా మాస్ ఎంటర్ టైనర్లు రాయడంలో చేయి తిరిగిన అనుభవం సంపాదించుకున్నాడు. ఇప్పుడీ మాస్ జాతర కూడా ఒక్క నెరేషన్ లోనే నాగవంశీని మెప్పించినట్టు టాక్ ఉంది. భీమ్స్ సంగీతం, శ్రీలీల గ్లామర్ లాంటి ఆకర్షణలు బోలెడున్నాయి. ఏప్రిల్ రిలీజ్ సాధ్యం కాదు. మే విడుదల వైపు చూస్తున్నారు కానీ ఇంకా డేట్ నిర్ణయం తీసుకోలేదు. అంతర్గత సమాచారమైతే మాస్ జాతరలో రవితేజ ఓ రేంజ్ లో వినోదాన్ని పండించాడని అంటున్నారు. అది కనక నిజంగా వర్కౌట్ అయితే మాత్రం ఫ్యాన్స్ కి హిట్టు పరంగా ఉన్న బాకీ పూర్తిగా తీరిపోతుంది.
This post was last modified on February 19, 2025 4:46 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…