టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ కొంచెం భిన్నంగా ఉంటుంది. ఆమె దశాబ్దంన్నరగా ఇక్కడ సినిమాలు చేస్తోంది కానీ.. టాలీవుడ్ జనాలతో వ్యక్తిగతంగా దగ్గరై స్నేహం చేయడం చాలా తక్కువ. సినిమా చేశామా.. ముంబయి వెళ్లిపోయామా అన్నట్లుండేది ఆమె వ్యవహారం. సమంత, తమన్నా, అనుష్క లాంటి సమకాలీన స్టార్ హీరోయిన్ల లాగా ఆమె ఇండస్ట్రీ జనాలతో సన్నిహితంగా ఉన్నట్లు ఎప్పుడూ సంకేతాలు కనిపించలేదు.
ఈ నేపథ్యంలో ఈ నెల చివర్లో జరగబోతున్న కాజల్ పెళ్లికి టాలీవుడ్ స్టార్ హీరోలెవరైనా వెళ్తారా అన్నది సందేహంగానే ఉంది. మామూలు రోజుల్లో అయితే ఓకే, అది కూడా హైదరాబాద్‌లో పెళ్లి అంటే అది వేరు. కానీ ఇప్పుడు కరోనా టైం నడుస్తోంది. పెళ్లిళ్లకు పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులు హాజరవుతున్నారు. పైగా కాజల్ పెళ్లి జరగబోయేది ముంబయిలో.
ఐతే స్టార్ హీరోల సంగతేమో కానీ.. యంగ్, అప్ కమింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం కాజల్ పెళ్లికి హాజరు కాబోతున్నాడు. ఈ విషయాన్ని అతనే వెల్లడించాడు. ఎక్కువగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేసిన కాజల్.. కెరీర్ చివర్లో బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఒకటికి రెండు సినిమాలు (కవచం, సీత) చేసి ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ సమయంలో వీళ్లిద్దరూ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిన విషయం కొన్ని ఫొటోలను బట్టి తెలిసింది.
కరోనా టైంలో కాజల్‌ను మిస్సవుతున్నట్లు కూడా శ్రీనివాస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు కాజల్ పెళ్లి గురించి శ్రీనివాస్ స్పందిస్తూ.. ‘‘కాజల్ నా బెస్ట్ ఫ్రెండ్. ఆమె నా కుటుంబంలోని వ్యక్తితో సమానం. కాజల్‌కు మంచి జీవిత భాగస్వామి దొరకడం సంతోషంగా ఉంది. గౌతమ్ గొప్ప వ్యక్తి. వారిద్దరికీ నా శుభాకాంక్షలు. నేనిప్పుడు షూటింగ్‌లో ఉన్నాను. కానీ విరామం తీసుకుని కాజల్ పెళ్లికి హాజరు కావాలి. మిగిలిన పనుల కోసం తన పెళ్లికి దూరం కాలేను’’ అని చెప్పాడు. ఈ మాటల్ని బట్టి శ్రీనివాస్, కాజల్‌లది క్లోజ్ ఫ్రెండ్‌షిప్పే అని అర్థమవుతోంది.
This post was last modified on October 23, 2020 12:16 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…