దేవర బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న వార్ 2 షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. కొంత పార్ట్ బ్యాలన్స్ ఉంది. ఆగస్ట్ 14 విడుదల తేదీని గత ఏడాదే ప్రకటించిన యష్ రాజ్ ఫిలింస్ ఆ తేదీని మిస్ చేసుకోకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. చాలా అరుదుగా ఈ ప్రొడక్షన్ హౌస్ లో వాయిదాలు ఉంటాయి కాబట్టి అభిమానులు ఆ నమ్మకంతోనే ఉన్నారు. అయితే హృతిక్ రోషన్, తారక్ డేట్లు సర్దుబాటు అవుతున్నప్పటికీ కీలకమైన ఇతర ఆర్టిస్టుల వల్ల కొంత జాప్యం అవుతుందని ముంబై టాక్. లేదంటే ఈపాటికి గుమ్మడికాయ కొట్టేసి పోస్ట్ ప్రొడక్షన్ ని పూర్తి స్వింగ్ లో పెట్టేవాళ్ళు.
అసలు ట్విస్ట్ ఏంటంటే ఇంకా ఇద్దరు హీరోల కాంబో పాట షూట్ జరగలేదు. ఈ స్పెషల్ సాంగ్ కోసం పలువురు హీరోయిన్లను సంప్రదిస్తున్నారు కానీ రకరకాల కారణాలతో ఎవరూ లాక్ కాలేదు. ఫిబ్రవరి మినహాయిస్తే చేతిలో కేవలం అయిదు నెలల సమయం మాత్రమే ఉంది. ఇందులోనే ప్రమోషన్లు కూడా చేసుకోవాలి. ఇది కావడం లేదు కాబట్టి ప్రశాంత్ నీల్ సెట్స్ లో తారక్ అడుగు పెట్టలేకపోతున్నాడట. ఎందుకంటే నీల్ మూవీ కోసం పూర్తిగా మేకోవర్ చేసుకోవాలి. అలా అయితే వార్ 2 కి అది సెట్ కాదు. 2026 సంక్రాంతికి తారక్ నీల్ సినిమా రిలీజ్ చేయాలనేది మైత్రి మూవీ మేకర్స్ పెట్టుకున్న టార్గెట్.
ఏమవుతుందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం కానీ ఇంకొద్దిరోజులు ఆగి చూడాల్సిందే. హీరో లేని సన్నివేశాలు ఆల్రెడీ నీల్ షూట్ చేసే పనిలో ఉన్నట్టు అప్డేట్ ఉంది. కానీ ఎక్కువ రోజులు ఇలా మేనేజ్ చేయలేరు. డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఇటీవలే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టారని బెంగళూర్ న్యూస్. సో అన్నీ బాగానే ఉన్నాయి కానీ టైంకి ఇవన్నీ పూర్తి చేయగలిగితే ఆగస్ట్ నుంచి వచ్చే జనవరి మధ్యలో అంటే కేవలం అయిదు నెలల కాలంలో రెండు జూనియర్ ఎన్టీఆర్ భారీ సినిమాలు వచ్చేస్తాయి. చూడాలి మరి.
This post was last modified on February 18, 2025 7:52 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…