Movie News

ప్రభాస్ ఫౌజీలో మహారాణి ఎవరు

సీతారామం తర్వాత దర్శకుడు హను రాఘవపూడి రూపొందిస్తున్న ఫౌజీ (ప్రచారంలో ఉన్న టైటిల్) శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్స్ తో పాటు వివిధ లొకేషన్లలో నాన్ స్టాప్ చిత్రీకరణ చేస్తున్నారు. ది రాజా సాబ్ కు బ్రేక్ ఇచ్చి మరీ స్పీడ్ పెంచారంటే డార్లింగ్ ఈ సబ్జెక్టు మీద ఎంత మనసు పెట్టాడో అర్థం చేసుకోవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్ ఇమాన్వి లుక్స్, నటన చాలా బాగా వచ్చాయని ఇన్ సైడ్ టాక్. స్వాతంత్రం రాక ముందు జరిగే నేపథ్యంలో ఫౌజీ కథ జరుగుతుందన్న విషయం తెలిసిందే.

అయితే కీలకమైన ఒక యువ మహారాణి పాత్ర కోసం క్రేజీ హీరోయిన్ ని సెట్ చేసే పనిలో హను రాఘవపూడి ఉన్నట్టు లేటెస్ట్ అప్డేట్. మొదటి ప్రాధాన్యంగా అలియా భట్ పేరు పరిశీలనలో ఉన్నట్టు వినికిడి. అయితే ఆర్ఆర్ఆర్ భామ ఖాళీగా లేదు. డేట్లు అంత సులభంగా దొరికే పరిస్థితి లేదట. ఫౌజీలో నిడివి పరంగా ఎక్కడ కాల్ షీట్లు అవసరం లేదు కాబట్టి వీలైనంత వేగంగా పూర్తి చేసేలా హామీ ఇస్తే కనక ఒప్పుకునే ఛాన్స్ లేకపోలేదు. అదే కనక జరిగితే క్రేజ్ మరింత పెరుగుతుంది. కానీ ఈ పాత్ర ప్రభాస్ కు జోడి కాకపోవచ్చు. కీలక మలుపుకు దోహదం చేస్తుంది తప్పించి హీరోతో ప్రేమలో పడే టైపు కాదట.

ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలంటే సీతారామంలో రష్మిక మందన్న తరహాలో ట్విస్టులను అనుసంధానం చేసే తరహాలో డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. మరి ఇమాన్వి క్యారెక్టర్ ఏంటంటే సైనికుడైన ప్రభాస్ ని ప్రేమించే ఒక మధ్యతరగతి యువతిగా స్పెషల్ గా ఉంటుందట. ఇవన్నీ అధికారికంగా తెలియడానికి మరికొంత సమయం పడుతుంది కానీ లీకులు మాత్రం ఫ్యాన్స్ కి మంచి ఎగ్జైట్ మెంట్ ఇచ్చేలా ఉన్నాయి. విడుదల తేదీ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ది రాజా సాబ్, ఫౌజీల మధ్య ఆరు నెలల గ్యాప్ ఉండేలా చూస్తున్నారట. ఇన్ సైడ్ టాక్ అయితే 2026 వేసవి అని ఉంది. చూడాలి.

This post was last modified on February 17, 2025 7:38 pm

Share

Recent Posts

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

9 minutes ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

3 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

4 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

5 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

12 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

13 hours ago