గత కొన్నేళ్లలో ఏ సినిమాకు లేనంత ప్రమోషన్లలో బ్రహ్మానందం పాల్గొనడం ఒక్క బ్రహ్మ ఆనందంకే జరిగింది. కారణాలు స్పష్టం. కొడుకు రాజా గౌతమ్ చాలా గ్యాప్ తర్వాత హీరోగా పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న పాత్రలో నటించడం, అతనికి తాతగా చేసే అవకాశం ఇందులో ఉండటం. పైగా టైటిల్ తన మీదే పెట్టి మార్కెటింగ్ చేశారు. దీంతో పూర్తి బాధ్యతను తీసుకున్నారు. చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి మరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చారంటే దానికి కారణం కేవలం బ్రహ్మి మీద అంతులేని అభిమానమే. ముందు రోజే ప్రీమియర్లు వేశారు.అవుట్ డోర్ పబ్లిసిటీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇవన్నీ జరిగిన ఆనందం మిగిలింది కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం బ్రహ్మ ఆనందం ఎలాంటి అద్భుతం చేయలేదు. ఇలాంటి సినిమాలకు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తేనే కమర్షియల్ గా పికప్ అవుతాయి. కానీ దర్శకుడు ఆర్విఎస్ నిఖిల్ వెయిట్ ఉన్న కంటెంట్ ని హ్యాండిల్ చేసిన తీరు ప్రేక్షకులను సంతృప్తి పరచలేకపోయింది. కేవలం బ్రహ్మానందం కోసమే చూడాలనుకుంటే ఓకే కానీ కామెడీ, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ అన్నీ కావాలని కోరుకుని థియేటర్ కు వెళ్లిన అధిక శాతం ఆడియన్స్ కి నిరాశే మిగిలింది. వైవిధ్యం కోసం పెట్టిన ఓల్డ్ ఏజ్ ప్రేమకథ కూడా అంతగా క్లిక్ కాలేకపోయింది.
ఫలితం సంగతి అలా ఉంచితే ఈ లెజెండరీ హాస్య నటుడిని ఇంత లెన్త్ ఉన్న రోల్ లో మళ్ళీ చూడటం అంత సులభమైతే కాదు. కొడుకు ఉన్నాడు, స్టోరీ నచ్చింది కాబట్టి ఒప్పుకున్నారు కానీ లేదంటే వచ్చేది కాదేమో. ఇప్పటికే తెరమీద కనిపించడం బాగా తగ్గించేసిన బ్రహ్మానందం కేవలం కొన్ని నిముషాలు మాత్రమే ఉండే క్యామియోలు అది కూడా చాలా ఆచితూచి ఎంచుకుంటున్నారు. ఇప్పుడీ బ్రహ్మ ఆనందం రిజల్ట్ చూశాక మరింత జాగ్రత్త పడతారనడంలో సందేహం లేదు. రాజా గౌతమ్ మాత్రం ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ దర్శకత్వంలో ఒక సినిమాలో ఆల్రెడీ నటిస్తుండటం విశేషం.
This post was last modified on February 17, 2025 6:11 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…