Movie News

ఆ బాలీవుడ్ స్టార్ హీరోతో పూరి సినిమా?

టాలీవుడ్లో ఒకప్పుడు పూరి జగన్నాథ్ ఎలాంటి వైభవం చూశాడో అందరికీ తెలిసిందే. ‘పోకిరి’ సహా తిరుగులేని విజయాలతో ఒకప్పుడు ఆయన ఒక వెలుగు వెలిగాడు. ఎందరో హీరోలను స్టార్లను చేసిన ఘనత ఆయన సొంతం. కానీ ఎంత గొప్ప దర్శకుడైనా ఒక దశ దాటాక ఔట్ డేట్ అయిపోవడం, వరుస ఫెయిల్యూర్లు ఎదుర్కొని ఇబ్బంది పడడం మామూలే. అందుకు పూరి కూడా మినహాయింపు కాలేకపోయాడు.

గత దశాబ్ద కాలంలో ‘ఇస్మార్ట్ శంకర్’ మినహా పూరికి సక్సెస్ లేదు. ‘ఇస్మార్ట్ శంకర్’ కూడా ఫ్లూక్ హిట్ అనే అభిప్రాయాన్ని బలపరుస్తూ.. ఆ తర్వాత ఆయన్నుంచి వచ్చిన ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ దారుణమైన ఫలితాలు అందుకున్నాయి. దీంతో పూరి కొత్త సినిమా పట్టాలెక్కడంలో ఇబ్బందులు తప్పట్లేదు. తెలుగులో పూరికి డేట్లు ఇచ్చే స్టార్ హీరో కనిపించడం లేదు. నిర్మాతలు దొరకడమూ కష్టంగానే కనిపిస్తోంది.

ఇలాంటి టైంలో పూరి గురి ఓ బాలీవుడ్ టాప్ స్టార్ మీద పడడం ఆసక్తి రేకెత్తించే విషయం. గత కొన్ని నెలలుగా పూరి కొత్త రైటర్లను పెట్టుకుని ఒక భారీ యాక్షన్ కథను రెడీ చేసినట్లు సమాచారం. ఇటీవలే ఆయన ముంబయికి వెళ్లి ఆ స్టోరీ నరేషన్ కూడా పూర్తి చేశారని తెలిసింది. అతను నరేషన్ ఇచ్చింది ‘యానిమల్’తో సూపర్ స్టార్‌గా ఎదిగిన రణబీర్ కపూర్‌కు కావడం విశేషం.

కథ విని రణబీర్ కూడా ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తోంది. కానీ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ మాత్రం ఇవ్వలేదు. కొంచెం టైం అడిగాడట. మరి నిజంగా రణబీర్ కపూర్ కనుక ఈ సినిమాను ఓకే చేసి, దీన్ని పూరి పట్టాలెక్కించగలిగితే అదొక సెన్సేషన్ కావడం ఖాయం. కెరీర్లో ఈ దశలో రణబీర్‌తో పూరి సినిమా ఓకే చేయించగలిగితే గొప్ప విషయమే.

పూరి ఈసారి బాలీవుడ్లోనే సినిమా చేయాలని పట్టుదలతో ఉన్నాడట. వేరే హీరోలు, నిర్మాతలను కూడా కలుస్తున్నాడట. త్వరలోనే ఏదో ఒక ప్రాజెక్టు ఓకే అవుతుందనే ఆశాభావంతో ఆయన టీం ఉంది. తమిళ యువ కథానాయకుడు శివకార్తికేయన్ సైతం పూరితో పని చేయడానికి ఆసక్తితో ఉన్నట్లు సమాచారం.

This post was last modified on February 17, 2025 5:17 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

11 minutes ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

1 hour ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

3 hours ago

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

3 hours ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

3 hours ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

3 hours ago