Movie News

ప్రశ్నల పద్మవ్యూహంలో వీరమల్లు యుద్ధం

అభిమానుల్లో, సగటు ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో ఎన్నో ప్రశ్నలు హరిహర వీరమల్లుని చుట్టుముడుతున్నాయి. అచ్చం పద్మవ్యూహంలో ఎలా బయటికి రావాలో తెలియని అభిమన్యుడిలా.

మార్చి 28 విడుదలవుతుందా లేదా, బ్యాలన్స్ చివరి చిన్న షెడ్యూల్ కి పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తారు, 40 రోజుల సమయం రీ రికార్డింగ్ – సెన్సార్ – ప్రమోషన్లకు సరిపోతుందా, ఒకవేళ వచ్చే పక్షంలో రాబిన్ హుడ్ తో పాటు మ్యాడ్ స్క్వేర్ వాయిదా వేయాలా వద్దా, థియేటర్లు ఎన్ని బ్లాక్ చేయాలి, విక్రమ్ – మోహన్ లాల్ డబ్బింగ్ సినిమాలున్నాయి వాటిని ఎలా ఎదురుకోవాలి. ఇలా రాసుకుంటూ పోతే పెద్ద క్వశ్చన్ బ్యాంక్ తయారయ్యేలా ఉంది.

ఎప్పటికప్పుడు పోస్టర్లలో మార్చి 28 డేట్ ని వేస్తూనే ఉన్నారు కానీ నిజంగా హరిహర వీరమల్లు ఆ టార్గెట్ అందుకోలగలడా లేదా అనే అనుమానం మాత్రం పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీకి హడావిడి రిలీజ్ న్యాయం కాదు.

మంచి పబ్లిసిటీ చేసుకోవాలి, నార్త్ ఆడియన్స్ కి చేరువ చేయాలి. పక్క రాష్ట్రాలకు వెళ్లి మీడియాను కలవాలి. పుష్ప 2 లాగా కొత్త ప్రాంతాల్లో భారీ ఎత్తున ఈవెంట్లు నిర్వహించాలి. వీటితో పాటు ఇంటర్వ్యూలు వగైరాలు మిస్ కాకుండా చేసుకోవాలి. రాజకీయంగా పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్న తరుణంలో ఇదంతా పెద్ద చిక్కుముడిగా కనిపిస్తోంది.

నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు జ్యోతి కృష్ణ పనుల వల్ల బయట కనిపించడం లేదు. ఇంతకు ముందు ముప్పాతిక భాగం దాకా డైరెక్ట్ చేసిన క్రిష్ ఏమో అనుష్క ఘాటీ వర్క్స్ లో తలమునకలై ఉన్నారు. అభిమానులు మాత్రం కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నారు. వీరమల్లుకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాలనే ఆశగా ఎదురు చూస్తున్నారు.

గేమ్ ఛేంజర్ గాయాన్ని ఇది మాన్పుతుందనే నమ్మకంతో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. పవన్ స్వయంగా పాడిన మాట వినాలి గురుడా మాట వినాలి ఆశించిన రేంజ్ లో వైరల్ కాలేదు. ఇన్ని స్పీడ్ బ్రేకర్ల మధ్య వీరమల్లు ప్రయాణం గమ్యం ఎలా చేరుకుంటుందో చూడాలి.

This post was last modified on February 17, 2025 3:58 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

1 hour ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

2 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

2 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

3 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

3 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

3 hours ago