పిల్ల జమీందార్ లాంటి హిట్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు యువ దర్శకుడు అశోక్. ఐతే ఓ కొరియన్ మూవీని కాపీ కొట్టి తీసిన ఆ సినిమా తర్వాత అతను అంచనాలను అందుకోలేకపోయాడు. సాయికుమార్ తనయుడు ఆది హీరోగా అతను తీసిన రెండో సినిమా సుకుమారుడు డిజాస్టర్ అయింది. ఆ తర్వాత అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రాంగద ప్రేక్షకులను చిత్రవధకు గురి చేసింది.
ఐతే ఈ సినిమా చేస్తుండగానే యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్లో అనుష్క ప్రధాన పాత్రలో ఓ హార్రర్ థ్రిల్లర్ చేసే అవకాశం దక్కింది అశోక్. ఆ సినిమానే.. భాగమతి. అశోక్ ఫామ్ చూసి ఈ సినిమా ఏమాత్రం వర్కవుటవుతుందో అని అంతా సందేహించారు.
కానీ భాగమతి ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెద్ద హిట్టయింది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే అవకాశం కూడా అశోక్‌నే వరించింది. భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రలో దుర్గావతి పేరుతో అక్కడీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు అశోక్. హీరో అక్షయ్ కుమార్, అగ్ర నిర్మాత భూషణ్ కుమార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 11న అమేజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది.
ఈ సినిమా చేస్తుండగానే అశోక్ బాలీవుడ్లో మరో అవకాశం దక్కించుకోవడం విశేషం. ఉఫ్ పేరుతో అతను అక్కడ ప్రయోగాత్మకంగా సైలెంట్ మూవీ చేయబోతున్నాడు. నుష్రత్ బరూచా, నోరా ఫతేహి, సోహమ్ షా ఇందులో ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ప్రముఖ దర్శకుడు లవ్ రంజన్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం.
This post was last modified on October 22, 2020 4:25 pm
పెద్ద హీరోల సినిమాలకు ఏ టైటిల్ పెట్టినా చెల్లుతుందనుకోవడం తప్పు. ఎంపికలో ఏ మాత్రం పొరపాటు చేసినా దాని ప్రభావం…
``జగన్ గురించి ఎందుకు అంత వ్యతిరేక ప్రచారం చేస్తున్నారో.. నాకు ఇప్పటికీ అర్ధం కాదు. ఆయన చాలా మంచి వారు.…
జనసేన నేత కిరణ్ రాయల్ పై రేగిన వివాదంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. రోజుకో కొత్త పరిణామం చోటుచేసుకుంటూ…
ఏఐ దిగ్గజం `మెటా` చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి, `ఫేస్ బుక్` అధినేత మార్క్ జుకర్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
వినడానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా... ఆరంటే ఆరు నిమిషాల్లోనే ఓ నిండు ప్రాణాన్ని పోలీసులు కాపాడారు. అది కూడా ఎక్కడో…
ఏపీలోని గోదావరి జిల్లాల పేరు చెప్పగానే 'పందెం కోళ్లు' గుర్తుకు వస్తాయి. ఆయా జిల్లాల్లో ఎక్కడో ఒక చోట రోజూ…