ఇటీవలే విడుదలైన లైలా విశ్వక్ సేన్ కి ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. ఇలాంటి డిజాస్టర్లు ప్రతి ఒక్కరికి వచ్చేవే కానీ కంటెంట్ మీద ఇన్ని నెగటివ్ విమర్శలు మార్కెట్, ఇమేజ్ పరంగా డ్యామేజ్ చేస్తాయి. అందుకే ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చింది. విశ్వక్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో మొదటిది ఫంకీ.
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. దర్శకుడు కెవి అనుదీప్. నిజానికీ కాంబో రవితేజ చేయాల్సింది. కానీ ఏవో కారణాల వల్ల అవకాశం భాను భోగవరపుకు వెళ్ళిపోయి అనుదీప్ కి విశ్వక్ సేన్ సెట్ అయ్యాడు. రెండు ఒకే సంస్థవి కాబట్టి అడ్జస్ట్ మెంట్ అన్నమాట.
ఈ ప్రాజెక్టు ఇద్దరికీ ఒకే రకమైన సవాల్ లాంటిది. ఎందుకంటే అనుదీప్ సైతం ఫామ్ లో లేడు. జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ తర్వాత రచన చేసిన ఫస్ట్ డే ఫస్ట్ షో సూపర్ ఫ్లాప్ అయ్యింది. తమిళ హీరో శివ కార్తికేయన్ పిలిచి ప్రిన్స్ అవకాశం ఇస్తే ఆశించిన ఫలితం రాలేదు. తర్వాత చిరంజీవికో కథ వినిపించాడని టాక్ వచ్చింది కానీ ఫైనల్ నెరేషన్ తో మెప్పించలేక ముందుకెళ్లలేదని మెగా వర్గాల టాక్.
సో మూడేళ్లుగా ఇతని ప్రయత్నాలు ఇలా జరుగుతూనే ఉన్నాయి. సో ఫంకీతో కనక గట్టిగా ప్రూవ్ చేసుకుంటే మళ్ళీ ఆఫర్లు క్యూ కడతాయి. ముఖ్యంగా స్టార్ హీరోలతో జట్టు కట్టాలంటే ఓ రేంజ్ కంబ్యాక్ ఇవ్వాల్సిందే.
ఇక విశ్వక్ సేన్ తన మీద వచ్చిన నెగటివిటీకి మొదటి సమాధానం ఇవ్వాల్సింది ఫంకీతోనే. అనుదీప్ కామెడీ టైమింగ్ ని కనక కరెక్ట్ గా పండించి కంటెంట్ బాగుంటే కనక ఆడియన్స్ ఖచ్చితంగా ఆదరిస్తారు. హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకోవడం దాదాపు ఖాయమని వినిపిస్తోంది.
ఒకవేళ అదే జరిగితే మూడో సవాల్ తనకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఉప్పెన, బంగార్రాజు, శ్యాం సింగ రాయ్ తర్వాత అమ్మడికి టాలీవుడ్ లో హిట్లు లేక తమిళ, మలయాళం వైపు వెళ్ళిపోయింది. గత ఏడాది శర్వా మనమే ఆడలేదు. ఎంపిక ఇంకా అఫీషియల్ అవ్వలేదు. సో వీళ్ళందరికీ బ్రేక్ ఇచ్చే బాధ్యత సితార మీదే ఉంది.