Movie News

రాధేశ్యామ్.. ఏమిటీ సస్పెన్స్?

‘బాహుబలి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన ప్రభాస్ నుంచి వస్తున్న కొత్త సినిమా ‘రాధేశ్యామ్’. ‘సాహో’ డిజాస్టరైనా సరే.. ఈ చిత్రంపై అంచనాలు తక్కువగా ఏమీ లేవు. ప్రభాస్ గత సినిమాల్లాగే ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్లో తెరకెక్కింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా బయటికొచ్చిన విశేషాల్ని బట్టి చూస్తే ఇదొక పీరియడ్ టచ్ ఉన్న సినిమా అని స్పష్టమవుతోంది.

30-40 ఏళ్ల వెనుకటి నేపథ్యంలో ఈ కథ నడుస్తుందన్న సంకేతాలే కనిపిస్తున్నాయి. ఈ సినిమా పోస్టర్లన్నింట్లోనూ వింటేజ్ టచ్ కనిపించింది. ఇదిలా ఉంటే.. సినిమాకు ‘రాధేశ్యామ్’ అని టైటిల్ పెట్టి, హీరో హీరోయిన్లను మాత్రం వేరే పేర్లతో పరిచయం చేయడం ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సినిమా టైటిల్ రిలీజ్ చేసినప్పటి నుంచి హీరో హీరోయిన్ల పేర్లు శ్యామ్, రాధ అనే భావిస్తున్నారంతా.

కానీ కొన్ని రోజుల కిందట పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా ఆమె పాత్ర పేరును ప్రేరణగా పరిచయం చేశారు. ఇక త్వరలో ప్రభాస్ పుట్టిన రోజు రానున్న నేపథ్యంలో రిలీజ్ చేసిన అతడి కొత్త పోస్టర్లో తన పేరును విక్రమాదిత్యగా పేర్కొన్నారు. దీంతో టైటిల్ అలా పెట్టి హీరో హీరోయిన్ల పేర్లు ఇలా ఫిక్స్ చేశారేంటి అన్న సందేహం కలుగుతోంది. ఐతే విక్రమాదిత్య, ప్రేరణ అనే పేర్లు కొంచెం పాతగా అనిపిస్తున్న నేపథ్యంలో ఇవి ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్లు అయి ఉండొచ్చని.. ఆ పాత్రలు చనిపోయి పునర్జన్మ ఎత్తాక వాటి పేర్లు శ్యామ్, రాధ కావొచ్చని భావిస్తున్నారు.

ఇది పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథ అన్న ఊహాగానాలు ఇంతకుముందే వినిపించిన నేపథ్యంలో ఈ అంచనానే నిజం కావచ్చేమో. ఇలా కాకుండా ‘రాధేశ్యామ్’ టీమ్ వేరే ట్విస్టు ఏమైనా ఇస్తుందేమో చూడాలి. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయాలని భావిస్తున్నారు. శుక్రవారం ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘రాధేశ్యామ్’ మోషన్ పోస్టర్ రాబోతున్న సంగతి తెలిసిందే.

This post was last modified on October 22, 2020 2:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

3 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

4 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago