కెరీర్ ఆరంభం నుంచి కొంచెం హద్దుల్లో ఉండే నటిస్తోంది రాశి ఖన్నా. ‘బెంగాల్ టైగర్’లో బికినీ వేసినా సరే.. అందాల ప్రదర్శనలో మరీ హద్దులు దాటిపోలేదు. క్యారెక్టర్లు చాలా వరకు కొంచెం పద్ధతిగానే ఉన్నాయి. కానీ ఈ మధ్యే రిలీజైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో మాత్రం రాశి కొంచెం బోల్డ్‌గా నటించింది.
అందులో వచ్చే ఒక బెడ్ రూం సీన్ చర్చనీయాంశం అయింది. ఈ సినిమా ట్రైలర్లో ఆ షాట్ చూసి రాశి ఫ్యాన్స్ హర్టయ్యారు. అప్పట్లో దీనిపై చాలా ట్రోలింగ్ కూడా జరిగింది. రాశిని ఇలా చూపించారేంటి అంటూ దర్శకుడు క్రాంతి మాధవ్ మీద.. హీరో విజయ్ దేవరకొండ మీద మండిపడ్డారు. ఐతే ఈ విమర్శల్ని అప్పుడు రాశి లైట్ తీసుకుంది. పాత్ర తాలూకు బోల్డ్ నెస్ కాకుండా.. ఎమోషన్ చూడాలని.. సినిమా చూశాక తన అభిమానులు అభిప్రాయం మార్చుకుంటారని అంది.
ఐతే వాళ్ల అభిప్రాయం ఎంత మారిందో ఏమో కానీ.. ఈ సినిమా ఎవరికీ రుచించలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రాశికి నిరాశే ఎదురైంది. వెంకీ మామ, ప్రతి రోజూ పండగే లాంటి హిట్ల తర్వాత రాశికి ఈ సినిమా ఫలితం పెద్ద షాకే. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరకపోవడంతో ఆమె తన అభిప్రాయం మార్చుకుంది.
ఇకపై బోల్డ్ క్యారెక్టర్లు చేయనని ఓ ఇంటర్వ్యూలో తెగేసి చెప్పింది. ఇందుకు ఆమె తన తల్లిదండ్రుల్ని కారణంగా చూపించింది. వాళ్లను ఇబ్బంది పెట్టే పాత్రలు ఇకపై చేయబోనంది. తాను ఆ సినిమాలోని సన్నివేశాల గురించి చెప్పినపుడే తన తల్లిదండ్రులు బాధ పడ్డారని.. అలాంటి సీన్లు చేయడం అవసరం లేదని తనకూ అనిపిస్తోందని.. తన అభిమానులు కూడా ఇలాంటి సన్నివేశాల్లో తనను చూడటానికి ఇష్టపడట్లేదని.. ఇకపై గ్లామరస్ సీన్లు చేస్తా తప్ప హద్దులు దాటనని రాశి స్పష్టం చేసింది.
This post was last modified on April 29, 2020 4:19 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…