న్యాచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ‘హిట్ 3 ది థర్డ్ కేస్’ మొదటి రెండు భాగాలకు భిన్నంగా చాలా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. విశ్వక్ సేన్, అడివి శేష్ చేసిన వన్ అండ్ టూ పార్ట్స్ లో కథ ఒకే కేసు చుట్టూ అది కూడా హైదరాబాద్, వైజాగ్ లాంటి సింగల్ లొకేషన్ లో జరుగుతుంది.
స్క్రీన్ ప్లే టైట్ గా ఉండటం వల్ల ఆడియన్స్ వాటితో బాగా కనెక్ట్ అయిపోయారు. ఊహించని ట్విస్టులతో సర్ప్రైజ్ చేసిన శైలేష్ ఇప్పుడు ఏకంగా నిర్మాత కం హీరోనే పోలీస్ ఆఫీసర్ గా మారడంతో వయొలెంట్ డోస్ అమాంతం పెంచేశాడట. లీక్స్ ప్రకారం హిట్ 3 కేస్ ఒకే చోట ఉండదు.
హైదరాబాద్, వైజాగ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ ఇప్పటిదాకా హిట్ 3 షూట్ చేసుకున్న ప్రాంతాలు. వీటిలో రిస్కీ వాతావరణం ఉండే కొండ, మంచు, ఎడారి ప్రాంతాలున్నాయి. కేవలం మర్డర్ మిస్టరీ అయితే ఇన్ని ఏరియాలు అవసరం లేదు. కానీ నాని పోషిస్తున్న అర్జున్ సర్కార్ పాత్ర దేశమంతా తిరిగిందంటే ఏదో పెద్ద సెటప్ ఉంటుంది.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన హత్యలకు ముడిపడిన కీలకమైన క్లూల కోసం నాని చాలా చోట్ల తిరుగుతాడట. అక్కడ ఎదురయ్యే సవాళ్లు, ప్రమాదాలు ఆడియన్స్ ఊహించని రీతిలో షాక్ ఇచ్చేలా ఉంటాయని వినికిడి.
ఈ లెక్కన నాని ఒక ఇంటర్వ్యూలో అన్నట్టు మొదటిసారి తన సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చినా ఆశ్చర్యం లేదని చెప్పడం నిజమయ్యేలా లేదు. గత ఏడాది వెంకటేష్ తో చేసిన సైంధవ్ దారుణంగా డిజాస్టర్ అయ్యాక శైలేష్ కొలనుకు దొరికిన సూపర్ ఛాన్స్ ఇది. ఖచ్చితంగా కంబ్యాక్ అవ్వాలనే టార్గెట్ తో కసిమీద పనిచేస్తున్నాడు.
అన్నట్టు హిట్ 1,2 లో చేసిన విశ్వక్, శేష్ ఇందులో కనిపిస్తారనే టాక్ ఉంది కానీ ఇంకా నిర్ధారణ కాలేదు. హిట్ 4కి మాస్ మహారాజా రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త కూడా ప్రచారంలో ఉంది. కాకపోతే హిట్ 3 విడుదలయ్యాక తప్ప దీని గురించి స్పష్టత వచ్చే అవకాశం లేదు.
This post was last modified on February 16, 2025 2:01 pm
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…
ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్‌గా…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు అనే బ్రాండ్ నుంచి బయట పడి స్వంతంగా ఇమేజ్ సృష్టించుకునేందుకు కష్టపడుతున్న ఆనంద్…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హుడేనంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్…