మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ తర్వాత వారసుల పరంగా అభిమానులు ఎదురు చూస్తున్న డెబ్యూ అకీరానందన్ దే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దీని కోసం మాములుగా వెయిట్ చేయడం లేదు. రేణు దేశాయ్ పలు సందర్భాల్లో కొడుకుని లాంచ్ చేయడానికి సానుకూలంగా ఉన్నట్టు చెప్పడం తెలిసిన విషయమే.
అందుకే అతను ఎక్కువగా తండ్రి దగ్గర ఉండేందుకు మొగ్గు చూపుతున్నా అభ్యంతర పెట్టలేదు. పలువురు నిర్మాతలు మొదటి ఛాన్స్ తమకే ఇవ్వమని పవన్ చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టారట. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ తెరంగేట్రం మీద ఏ ప్రొడ్యూసర్ అయినా కన్ను వేయకుండా ఎందుకుంటాడు.
ఇదిలా ఉండగా అకీరానందన్ డెబ్యూ గుళ్ళలో జరిగిపోయింది. కేరళ, తమిళనాడు ఆధ్యాత్మిక యాత్రకు కొడుకుని తనతో పాటుగా తీసుకెళ్లిన పవన్ ఇప్పుడా టూర్ పుణ్యామాని వారసుడిని మీడియాలో హైలైట్ చేశారు. డిప్యూటీ సిఎం, తెలుగు పవర్ స్టార్ కావడంతో ఈ పర్యటనని కోలీవుడ్ మీడియా బాగా కవర్ చేసింది.
దీంతో చాలా వీడియోలు బయటికి వచ్చాయి. అకీరాని ఇంత సేపు చూసే ఛాన్స్ దక్కింది ఇప్పుడే. బెంగళూరు అభిమానులు ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఒక వీడియో ఏవి తయారు చేయించి ఆరంజ్ స్పెషల్ షోలలో ప్రదర్శించారంటే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అకీరా రేపో ఎల్లుండో ఎప్పుడైనా రావొచ్చు. కానీ దానికి సరిపడా గ్రౌండ్ మాత్రం ముందే సిద్ధమైపోయింది. తన ఫోటోలు, వీడియోలు తెగ షేరవుతున్నాయి. మధురైలో ఓజి కెమెరామెన్ రవిచంద్రన్ అకీరాని చూస్తూ ఆశ్చర్యపోయే ఎక్స్ ప్రెషన్ తో ఇచ్చిన పిక్ ఒకటి ఫ్యాన్స్ మధ్య తెగ చక్కర్లు కొట్టింది.
ఎవరికి వారు దానికి రకరకాల అర్థాలు అన్వయించేశారు. ట్విస్ట్ ఏంటంటే అకీరాకు నటన కంటే ఎక్కువ సంగీతం, ఎడిటింగ్ మీద ఆసక్తి ఎక్కువట. ఫ్యాన్స్ మాత్రం అదేం చెల్లదు, నువ్వేం చేయాలో నిర్ణయించాల్సింది మేమంటూ సరదాగా కౌంటర్లు, ఎక్స్ పోస్టులు వేయడం కొసమెరుపు. ఫ్యానిజం అలాగే ఉంటుంది మరి.
This post was last modified on February 15, 2025 12:08 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…