‘ఆర్.ఆర్.ఆర్.’ తర్వాత ఇమ్మీడియట్‌గా చేయబోయే చిత్రం ఏమిటనేది చరణ్ ఇంకా డిసైడ్ చేసుకోలేదు. అయితే ఆ ప్రాజెక్ట్ తర్వాత వచ్చే రెండు సినిమాలకు మాత్రం టాప్ డైరెక్టర్లను లాక్ చేసుకున్నాడు. త్రివిక్రమ్‌తో చరణ్ సినిమా ఒకటి ఖాయం చేసుకున్నాడు. అయితే దాని కంటే ముందుగా త్రివిక్రమ్ తారక్, మహేష్ సినిమాలు చేయాల్సి వుంటుంది.
ఇక కొరటాల శివతో ఎప్పట్నుంచో అనుకుంటూ కుదరని ప్రాజెక్ట్ కూడా చరణ్ లైన్లో పెట్టేసినట్టు తెలిసింది. ఆచార్య తర్వాత అల్లు అర్జున్ సినిమా చేయనున్న కొరటాల తన తదుపరి చిత్రాన్ని చరణ్‌తోనే చేస్తాడట. అయితే ఈ రెండు సినిమాల కంటే ముందు చరణ్ ఓ సినిమా చేయాలి.
అదెవరితో చేయాలనేది ఇంకా ఫిక్స్ అవలేదు. కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలుగులో అగ్ర హీరోతో ఒక సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్‌తో అతని ప్రయత్నాలు ఫలించలేదు. అతను కెజిఎఫ్ 2 రిలీజ్ అయిన తర్వాత చరణ్‌ని కాంటాక్ట్ చేసే అవకాశముందని అంటున్నారు.
మరి చరణ్‌తో అయినా అతని సినిమా ఖాయం అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఆర్.ఆర్.ఆర్. తర్వాత పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోరుకుంటే మాత్రం ప్రశాంత్ నీల్ మంచి ఆప్షనే.
Gulte Telugu Telugu Political and Movie News Updates