బిగ్‍బాస్ పేరుకి ఆడియన్స్ అభిప్రాయాలను బట్టి నడిచే రియాలిటీ షోనే కానీ దాని ఓటింగ్ ప్రాసెస్‍లో బోలెడు లుకలుకలున్నాయి. ఆడియన్స్ ఓటింగ్ ద్వారా విజేత డిసైడ్ అవుతాడు కాబట్టి ఈ షోకి వెళ్లే ముందు పలువురు కంటెస్టెంట్లు కొన్ని ఏజెన్సీలతో టై అప్ అయి తమకు ఓట్లు పోలయ్యేలా చూసుకుంటూ వుంటారు. హిందీలో బిగ్‍బాస్ ఎప్పట్నుంచో నడుస్తున్నా కానీ అది నేషనల్ వైడ్ రీచ్ వుంది కనుక ఇలాంటివి అక్కడ చెల్లలేదు. తెలుగు షో రీజనల్ కనుక ఓట్ల మ్యానిప్యులేషన్ ఈజీ అయిపోయింది.
షో గెలిచినా, లేకపోయినా కానీ ఎక్కువ వారాల పాటు షోలో వుండేట్టు పలువురు జాగ్రత్త పడుతున్నారు. అయితే ఎంత కాదన్నా షో ఒక లెవల్‍కి చేరే సరికి ఆడియన్స్ ఓట్లు కీలకమవుతాయి. కానీ ఈ సీజన్లో ఇంతవరకు క్రౌడ్ ఫేవరెట్ అంటూ ఎవరూ ఏర్పడలేదు. దీంతో మొదట్నుంచీ పీ.ఆర్. మేనేజ్‍మెంట్‍తో ఓట్ల పరంగా లీడింగ్‍లో వున్నాడనే అభియోగాలు ఎదుర్కొంటోన్న అభిజీత్ ఇప్పటికీ తన ఆధిక్యం కొనసాగిస్తున్నాడు.
షోలో అతను ఫేవరెట్ అని చెప్పుకోడానికి ఇంతవరకు ఒక్క మొమెంట్ కూడా లేదు. ప్రతి టాస్కులోను దొడ్డి దారులు వెతికి గెలవాలని చూస్తాడే తప్ప ఎఫర్టస్ పెట్టడు. డాన్సులు చేయడు, ఎంటర్‍టైన్‍మెంట్ ఇవ్వడు, మిగతా వాళ్లను తక్కువగా చూస్తుంటాడు. అయితే బిగ్‍బాస్ ట్రెండ్స్ చూస్తే మాత్రం అతను తుమ్మినా, దగ్గినా ఎలివేషన్ ఇస్తూ పలు అకౌంట్లు రాత్రీ పగలూ అదే పని మీదుంటారు.
ఆల్రెడీ సగానికి చేరుకున్న సీజన్లో ఇకమీదట అయినా ఎవరైనా పబ్లిక్‍తో కనక్షన్ సాధించకపోతే ఇప్పుడు జరిగే ఓటింగ్ పరంగా అభిజీత్ విన్నర్ అవుతాడు. అదే జరిగితే ఇకపై షోకి వచ్చే కంటెస్టెంట్లు ఏజెన్సీలను సెట్ చేసుకుని వచ్చి రియాలిటీ షోని కంగాళీ చేసి పారేస్తారని బిగ్‍బాస్ ట్రెండ్స్ ని నిశితంగా పరిశీలించే వారు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on October 21, 2020 10:56 pm
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…