కమల్ హాసన్ కెరీర్ లోనే అత్యంత దారుణమైన డిజాస్టర్ గా మిగిలిన సినిమాల్లో భారతీయుడు 2 ఒకటి. ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన క్లాసిక్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ తీయాలనే ఆలోచనతో దర్శకుడు శంకర్ రాసుకున్న అత్తెసరు కథా కథనాలు సూపర్ ఫ్లాప్ ని చేతికిచ్చాయి. అప్పటి నుంచి మూడో భాగం వస్తుందా రాదానే అనుమానాలు అభిమానుల్లో బలంగా ఉన్నాయి.
గేమ్ ఛేంజర్ రిలీజ్ కాగానే దీని పనులు మొదలుపెడతానని శంకర్ పలు ఇంటర్వ్యూలలో చెప్పారు ఫ్యాన్స్ అయితే పెద్దగా నమ్మకం పెట్టుకోలేదు. తాజాగా ఇండియన్ 3ని బయటికి తీసుకొచ్చేందుకు లైకా నడుం బిగించిందని సమాచారం.
అందులో భాగంగా సెకండ్ పార్ట్ ఆడియో లో మాత్రమే ఉండి సినిమాలో లేని పారా పాటను వీడియో రూపంలో ఇండియన్ 3 విజువల్స్ ని పొందుపరిచి విడుదల చేశారు. ఇది చూస్తే కొంత సానుకూల అభిప్రాయం కలగడం ఖాయం. అసలు కథంతా థర్డ్ పార్ట్ లోనే ఉంది.
కేవలం బ్రాండ్ ని క్యాష్ చేసుకోవాలనే అత్యాశతో సాగదీయడంతో అక్కర్లేని రెండో భాగం జనాలను విసిగించింది. అయితే ఎంత కాదనుకున్నా ఇది కమల్ మూవీ కాబట్టి ప్రమోషన్లు చేస్తే జనాన్ని థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేయొచ్చు. అందులోనూ స్వతంత్ర పోరాటానికి ముందు సేనాపతి అసలు ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఇందులోనే ఉంది.
దీనికన్నా ముందు మణిరత్నం తగ్ లైఫ్ విడుదలయ్యాకే ఇండియన్ 3 వదలాలనేది లైకా ఆలోచనగా చెన్నై టాక్. ఎలాగూ తగ్ లైఫ్ మీద పాజిటివ్ వైబ్స్ చాలా ఉన్నాయి. క్రేజ్ కూడా భారీ ఎత్తున నెలకొంది. అది కనక హిట్ అయితే తర్వాత కమల్ మూవీ ఏదైనా ఆటోమేటిక్ గా బజ్ వస్తుంది.
అందుకే సారా పాటలో కొత్త సీన్ల తాలూకు క్లిప్పులు కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కాజల్ అగర్వాల్ పాత్ర ఇక్కడే కీలకం కానుంది. అయినా కమల్ లాంటి సీనియర్ స్టార్ కు ఇలాంటి పరిస్థితి రావడం విచిత్రమే. అన్నట్టు ఇండియన్ 3 నేరుగా ఓటిటిలో వస్తుందనే ప్రచారం వట్టిదేనట. థియేటర్ రిలీజ్ కే ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on February 13, 2025 6:01 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…