ఈ వేసవిలో టాలీవుడ్ నుంచి రాబోతున్న ఏకైక భారీ చిత్రం.. కన్నప్ప. రాజా సాబ్, విశ్వంభర లాంటి పెద్ద సినిమాలు వేసవి బరి నుంచి తప్పుకున్నట్లు కనిపిస్తుండడంతో ప్రేక్షకుల దృష్టి ‘కన్నప్ప’ మీదికి మళ్లుతోంది. మామూలుగా మంచు విష్ణు సినిమా అంటే అంత హైప్ ఉండేది కాదు కానీ.. ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి బిగ్ స్టార్స్ నటిస్తుండడం.. ఏకంగా వంద కోట్లకు పైగా బడ్జెట్లో సినిమా తెరకెక్కడం.. క్లాసిక్ మూవీ అయిన ‘భక్త కన్నప్ప’కు మోడర్న్ అడాప్షన్ కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఈ చిత్రం కోసం విష్ణు ఇంతమంది పెద్ద స్టార్లను ఒప్పించడం విశేషమే. ఐతే మిగతా వాళ్ల సంగతేమో కానీ.. అక్షయ్ కుమార్‌ను శివుడి పాత్రకు ఒప్పించడానికి మాత్రం విష్ణు చాలానే కష్టపడ్డాడట. ఒక ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ.. అక్షయ్ ‘కన్నప్ప’లో శివుడి పాత్రను రెండుసార్లు తిరస్కరించినట్లు వెల్లడించాడు. కానీ మూడో ప్రయత్నంలో ఒక పెద్ద డైరెక్టర్ ద్వారా రాయబారం నడిపి.. తన పాత్ర గురించి బలంగా చెప్పి ఒప్పించినట్లు విష్ణు తెలిపాడు.
ఆ డైరెక్టర్ ఎవరన్నది విష్ణు వెల్లడించలేదు. ఈ తరానికి శివుడి పాత్ర గొప్పదనం గురించి చూపించడానికి మీరే సరైన వారని చెప్పి అక్షయ్‌ని ఒప్పించినట్లు విష్ణు తెలిపాడు. నిజానికి అక్షయ్ ఓకే కావడానికి ముందు ఈ సినిమాలో శివుడి పాత్రను ప్రభాస్ చేస్తాడని ముందు వార్తలు వచ్చాయి. ఐతే ప్రభాస్‌కు కథ చెప్పినపుడు తనకోసం శివుడి పాత్రనే దృష్టిలో ఉంచుకున్నప్పటికీ అతడికి వేరే పాత్ర నచ్చి తాను ఎంచుకున్నాడని విష్ణు గతంలో చెప్పాడు.
ఆ పాత్ర గురించి సస్పెన్స్ ఇటీవలే వీడింది. రుద్ర అనే శివుడి దూత పాత్రను ప్రభాస్ ఇందులో పోషించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25న ‘కన్నప్ప’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on February 13, 2025 4:53 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…