Movie News

తీరం చేరుకున్న తండేల్… ఇకపై లాభాలే

నాగచైతన్య కెరీర్ లో పెద్ద హిట్టుగా నిలిచే దిశగా వెళ్తున్న తండేల్ ఆరు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించినట్టు ట్రేడ్ టాక్. థియేట్రికల్ బిజినెస్ పెట్టుకున్న టార్గెట్ సుమారు 40 కోట్లకు దగ్గరగా ఉండగా నిన్నటితో ఆ లాంఛనం పూర్తయ్యిందని అంటున్నారు. నిర్మాణ సంస్థ నుంచి ఇంకా అధికారిక పోస్టర్ రాలేదు కానీ డెబ్భై కోట్ల గ్రాస్ ఆల్రెడీ దాటేసిన నేపథ్యంలో ఇందులో శంకించడానికి ఏమి లేకపోవచ్చు.

నాగచైతన్య, సాయిపల్లవితో పాటు నిర్మాతలు బన్నీ వాస్, అల్లు అరవింద్ తిరుమల ట్రిప్, సక్సెస్ యాత్రలో బిజీగా ఉండటం వల్ల అప్డేట్స్ విషయంలో కొంత జాప్యం జరుగుతోంది. ఏదైతేనేం చైతు సక్సెస్ కొట్టేశాడు.

కీలకమైన రెండో వారం రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్న టికెట్ రేట్ల పెంపు గడువు ఇవాళ్టితో ముగుస్తుంది. సో ఏపీ వసూళ్లు మరింత పికపవుతాయనే ఆశాభావం బయ్యర్లలో కనిపిస్తోంది. కొత్త రిలీజుల్లో లైలా, బ్రహ్మ ఆనందం భారీ క్యాస్టింగ్ లేనివి కావడంతో వాటి మనుగడ టాక్ మీద ఆధారపడి ఉంటుంది.

ఒకవేళ పాజిటివ్ వచ్చినా తండేల్ కొచ్చిన ఇబ్బందేమీ లేదు. ఎందుకంటే విశ్వక్ సేన్ మూవీకి ఏ సర్టిఫికెట్ వచ్చింది. రెండోది కేవలం బ్రహ్మానందం ఇమేజ్ మీద ఆధారపడింది. సో ఫ్యామిలీ ఆడియన్స్ కి తిరిగి ఫస్ట్ ఛాయస్ తండేల్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.

మొదటి రోజే హెచ్డి పైరసీ లీకైనా, ఆర్టిసి బస్సుల్లో ఆ ప్రింట్ ని ప్రదర్శించినా తండేల్ అవన్నీ తట్టుకుని నిలబడటం విశేషమే. టీమ్ మాత్రం పబ్లిసిటీ ఆపే ఉద్దేశంలో లేదు. ప్రమోషన్లు మరింత ఉదృతంగా చేయబోతున్నారు. వీక్ డేస్ లో నెమ్మదించిన వైనాన్ని పుంజుకోవడానికి సరిపడా ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు.

ఫిబ్రవరి 21 వచ్చేవి కూడా మీడియం సినిమాలే. సో ఆడియన్స్ ని నిలబెట్టుకోగలిగితే చైతుకి కెరీర్ బెస్ట్ నెంబర్స్ వస్తాయి. ప్రస్తుతానికి వంద కోట్ల గ్రాస్ వైపు పరుగులు పెడుతోంది. ఈ వీకెండ్ అయ్యాక ఆ లాంఛనం జరగడం దాదాపు ఖాయమే. లాంగ్ రన్ మీద బన్నీ వాస్ చాలా నమ్మకంగా ఉన్నారు.

This post was last modified on February 13, 2025 2:48 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

7 minutes ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

32 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

35 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

1 hour ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

3 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago