సరిగ్గా పదేళ్ల క్రితం నాటి మాట. 2014 సంవత్సరం. జూనియర్ ఎన్టీఆర్ వరస ఫ్లాపుల్లో ఉన్నాడు. మార్కెట్ తగ్గలేదు కానీ తమ హీరోకు బ్లాక్ బస్టర్ పడటం లేదనే బాధ అభిమానుల్లో కనిపిస్తోంది. దర్శకుడు పూరి జగన్నాధ్ ది కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వేరే రచయిత వక్కంతం వంశీ ఇచ్చిన కథ బాగా నచ్చడంతో ఈ కాంబోలో సినిమా తీసేందుకు రెడీ అయ్యారు నిర్మాత బండ్ల గణేష్.
తొలుత ప్రకటన వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇది నిజంగా వర్కౌట్ అవుతుందానే అనుమానాలు లేకపోలేదు. కట్ చేస్తే ఇన్స్ పెక్టర్ దయాగా ఒక దయలేని పోలీస్ గా తారక్ క్యారెక్టర్ ని సరికొత్తగా డిజైన్ చేశారు పూరి.
ముందు అనుకున్న దేవిశ్రీ ప్రసాద్ బదులు మిక్కీ జె మేయర్ లాకయ్యాడు. నేపధ్య సంగీతం ఇవ్వడానికి మణిశర్మ ఒప్పుకున్నారు. హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ఫిక్స్. విలన్ గా ప్రకాష్ రాజ్ తప్ప వేరే ఆప్షన్ ఉండేది కాదు. ఎక్కువ ఆలస్యం చేయకుండా షూటింగ్ వేగంగా పూర్తయిపోయింది.
2015 ఫిబ్రవరి 13 ఒకరకంగా డ్రై సీజన్ లో టెంపర్ రిలీజయ్యింది. నెగటివ్ షేడ్స్ తో మొదలయ్యే తారక్ పాత్రను ఫస్ట్ హాఫ్ లో చూసి ప్రేక్షకులు షాక్ తిన్నారు. ఒక అనూహ్యమైన మలుపుతో దయా క్యారెక్టర్ లో వచ్చే మార్పుని పూరి చూపించిన తీరు శభాష్ అనిపించుకుంది. ముఖ్యంగా కోర్టు సన్నివేశాల్లో జూనియర్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.
మాస్, యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఇలా ఏదీ మిస్ కాకుండా టెంపర్ నడిపించిన తీరు విమర్శకులను మెప్పించింది. పాటలు మాస్ కి ఎక్కేశాయి. బిజిఎం కోసమే మళ్ళీ థియేటర్లకు వెళ్లిన వాళ్ళున్నారు. జూనియర్ నటన చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. డాన్సులు సైతం అంతే స్థాయిలో పండాయి. 74 కోట్లకు పైగా వసూలు చేసింది.
తర్వాత తారక్ ఎన్నో బ్లాక్ బస్టర్స్ చేసి ఉండొచ్చు కానీ టెంపర్ లాంటి ఆల్ ఇన్ వన్ ప్యాకేజీ లాంటి హై ఎనర్జీ సినిమా మరోసారి పడాలి. రీ రిలీజ్ చేయడం కాదు దయా లాంటి మల్టీషేడ్స్ లో యంగ్ టైగర్ ని మరిన్నిసార్లు చూడాలి. దాన్ని ఆయాన్ ముఖర్జీ, ప్రశాంత్ నీల్ ఎవరు నెరవేరుస్తారో మరి.
This post was last modified on February 13, 2025 12:05 pm
ప్రముఖ సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మంచు మోహన్ బాబుకు గురువారం భారీ ఊరట లభించింది. టీవీ జర్నలిస్టుపై…
నాగచైతన్య కెరీర్ లో పెద్ద హిట్టుగా నిలిచే దిశగా వెళ్తున్న తండేల్ ఆరు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించినట్టు ట్రేడ్…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కొత్త సీజన్ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. యువ ఆటగాడు రజత్ పటీదార్‌ను జట్టు…
ఒకప్పుడు క్లాసిక్ ఫిలిం మేకర్ గా రాంగోపాల్ వర్మ అంటే ప్రేక్షకులకు విపరీతమైన గౌరవం, అభిమానం ఉండేవి కానీ గత…
మంచు విష్ణు కన్నప్ప ఏప్రిల్ 25 విడుదలకు సిద్ధమవుతోంది. ఇంకో డెబ్భై రోజులు మాత్రమే ఉండటంతో టీమ్ ప్రమోషన్ల వేగం…
వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన.. ఉత్త రాంధ్ర జిల్లాల వైసీపీ కో…