పెద్ద హీరోల సినిమాలకు ఏ టైటిల్ పెట్టినా చెల్లుతుందనుకోవడం తప్పు. ఎంపికలో ఏ మాత్రం పొరపాటు చేసినా దాని ప్రభావం నేరుగా ఓపెనింగ్స్ మీద పడుతుంది. ఇటీవలే ‘గేమ్ ఛేంజర్’ పేరు మాస్ కి చేరలేక అప్పటికే తక్కువగా ఉన్న బజ్ ని మరింత కిందకు తీసుకెళ్లింది.
ప్యాన్ ఇండియా కోసం ఇలా పెడుతున్నామని దర్శక నిర్మాతలు సమర్ధించుకోవచ్చు కానీ అన్ని వర్గాలకు అది కనెక్ట్ అయ్యేలా ఉందో లేదో చెక్ చేసుకోవడం అవసరం. రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రానికి ‘పవర్ క్రికెట్’ పేరుని పరిశీలిస్తున్నట్టు వస్తున్న వార్త ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఎందుకంటే ఈ టైటిల్ వినగానే ఏదో టీవీ రియాలిటీ షోలా అనిపిస్తోంది కానీ రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో మూవీలా కాదనేది వాళ్ళ అభిప్రాయం. దీని కన్నా ఎప్పుడో ప్రచారంలోకి వచ్చిన ‘పెద్ది’నే బెస్ట్ అంటున్నారు. అయితే అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉండేలా చూసుకోవడం పెద్ద సవాల్ గా మారింది.
పెద్ది అంటే తెలుగు వాళ్లకు అర్థమవుతుంది కానీ నార్త్ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. అలాని పవర్ క్రికెట్ అని పెట్టినంత మాత్రాన పాజిటివ్ వైబ్స్ వచ్చేయవు. ప్రస్తుతానికి ఇదంతా చర్చల దశలో ఉంది కాబట్టి టెన్షన్ ఏం లేదు కానీ మార్చిలో వచ్చే చరణ్ పుట్టినరోజు లోపు డిసైడ్ చేయాలి.
క్రీడల బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ విలేజ్ డ్రామాలో కుస్తీ, క్రికెట్ రెండు అంశాలు హైలైట్ అవుతాయట. ముఖ్యంగా పవర్ క్రికెట్ బ్యాక్ డ్రాప్ కీలకంగా ఉంటుందట. శివరాజ్ కుమార్ వచ్చే షెడ్యూల్ నుంచి చేరిపోయే అవకాశముంది. ఇటీవలే అమెరికాలో క్యాన్సర్ చికిత్స నుంచి కోలుకున్న శివన్న ప్రస్తుతం బెంగళూరులో రెస్ట్ తీసుకుంటున్నారు.
బయటకి రాగానే ముందు ప్రాధాన్యం ఇచ్చేవాటిలో ఆర్సి 16 ఫస్ట్ ఉంది. దీంతో పాటు కమిటైన రెండు కన్నడ సినిమాలు, జైలర్ 2కి డేట్స్ ఇవ్వాలి. ఇదలా ఉంచితే వీలైనంత త్వరగా టైటిల్ నిర్ణయం తీసుకుంటే బెటర్. ఎందుకంటే టీజర్ వదిలే ప్లాన్ కూడా ఉంది.
This post was last modified on February 12, 2025 5:52 pm
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…
ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…
షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…
ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…