నిన్న జరిగిన తండేల్ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగార్జున అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ విజయాలకు 2025 ముహూర్తం అని చెప్పడమే కాకుండా నాగచైతన్యతో వస్తున్నాం, కొడుతున్నామని అనిపించడం ఫ్యాన్స్ చప్పట్లతో హోరెత్తిపోయేలా చేసింది.
నిజానికిది అక్కినేని కుటుంబం గత కొంత కాలంగా ఎదురు చూసిన ఘట్టం. నాగార్జునకేమో బ్లాక్ బస్టర్లు పడటం లేదు. గత కొన్నేళ్లలో సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు, నా సామిరంగా తప్ప చెప్పుకోదగ్గ హిట్లు లేవు. లేనిపోని ప్రయోగాలు చేసి ఇంగ్లీష్ టైటిల్స్ తో డిజాస్టర్లు మూటగట్టుకున్నారు. గత ఏడాది సంక్రాంతి తర్వాత ఏడాది గ్యాప్ వచ్చేసింది.
ఈ సంవత్సరం ఒకటి కాదు ఏకంగా రెండు ప్యాన్ ఇండియా సినిమాల్లో భాగమయ్యారు. కుబేర మెయిన్ హీరో ధనుష్ అయినప్పటికీ నాగార్జున ప్రాధాన్యం, పాత్రకున్న ప్రత్యేకత దీన్ని మల్టీస్టారర్ స్థాయికి తీసుకెళ్తున్నాయని ఇన్ సైడ్ టాక్. దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి ఊహించని సర్ప్రైజ్ ఉంటుందని అంటున్నారు.
రజనీకాంత్ కూలిలో సైతం విక్రమ్ రోలెక్స్ లాగా నాగ్ కు చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ ని లోకేష్ కనగరాజ్ డిజైన్ చేసినట్టుగా చెన్నై వర్గాల కథనం. సో ఈ రెండు కనక వర్కౌట్ అయితే నాగ్ కంబ్యాక్ మాములుగా ఉండబోవడం లేదు. ఆలస్యమవుతున్నా సరే కథల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నారు.
ఇక అఖిల్ విషయానికి వస్తే ఏజెంట్ గాయం నుంచి కోలుకుని కొత్త చిత్రం మొదలుపెట్టేందుకు ఏడాదికి పైగానే పట్టింది. ఇటీవలే లెనిన్ మొదలుపెట్టారు. కంటెంట్ గురించి లీక్స్ ఆసక్తికరంగా ఉంటున్నాయి. రెగ్యులర్ జానర్ కాకుండా దర్శకుడు మురళికిషోర్ అబ్బూరు ఒక సరికొత్త బ్యాక్ డ్రాప్ తీసుకున్నారట.
కుబేర, కూలి, లెనిన్ అన్నీ 2025లోనే రిలీజవుతాయి. చైతుకి తండేల్ బ్లాక్ బస్టర్ పడింది. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందే మిస్టిక్ థ్రిల్లర్ కనక వేగంగా షూట్ జరుపుకుంటే ఈ సంవత్సరం రెండోసారి తన దర్శనం ఉంటుంది. లేదంటే కాస్త లాంగ్ వెయిటింగ్ తప్పదు.
మొత్తానికి నాగ్ చెప్పినట్టు 2025 నిజంగానే ముహూర్తమని చెప్పొచ్చు. నాగార్జున, అఖిల్, నాగ చైతన్య ముగ్గురు ఎంచుకుంటున్న కాంబోలు వైవిధ్యంగా అనిపించడమే కాక ప్రేక్షకుల్లో అంచనాలు రేకెత్తించేలా కనిపిస్తున్నాయి. మొహమాటలకు పోకుండా, తొందరపడకుండా ఎంపికలో తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలు ఇచ్చేలా ఉన్నాయి.
సుమంత్, సుశాంత్ కూడా కంబ్యాక్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకోవైపు అన్నపూర్ణ స్టూడియోస్ డాల్బీ విజన్ టెక్నాలజీని ఇండియాకు తీసుకొచ్చి అటు ప్రొడక్షన్ లోనూ సరికొత్త మైలురాళ్లను నెలకొలుపుతోంది. ఇవన్నీ ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తేవే.
This post was last modified on February 12, 2025 11:42 am
ఎంత టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో ఒక్కోసారి అవకాశాలు అంత వేగంగా రావు. హిట్టు పడినా సరే కొన్నిసార్లు దురదృష్టం పలకరించి…
సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…
తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం…
ఇంగ్లండ్పై టీ20, వన్డే సిరీస్లు చేజిక్కించుకున్నా తరువాత.. భారత జట్టులో బ్యాటింగ్ ఆర్డర్పై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్…
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా…