హై బీపీతో ఆసుపత్రిలో చేరిన పృథ్వీ

సినిమా వేడుకలో రాజకీయ వ్యాఖ్యలు చేసి కలకలం రేపి పెను వివాదానికి తెర తీసిన ౩౦ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ తాజాగా ఆసుపత్రిలో చేరాడు. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన తాజా చిత్రం లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే జరగగా.. ఆ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో పృథ్వీరాజ్ కూడా ఉన్నారు. ఈ సినిమాలో ఓ పాత్రలో కనిపించిన పృథ్వీ వేడుకలో మాట్లాడుతూ వైసీపీ పేరు ఊటంకించకుండానే… ఆ పార్టీపై సెటైర్లు వేశారు.

పృథ్వీ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. వైసీపీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన పృథ్వీ క్షమాపణలు చెప్పాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. లేదంటే…లైలా సినిమాకు తమ సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అనుకున్నట్టుగానే… బొయికాట్ లైలా అంటూ హాష్ టాగ్ లతో సోషల్ మీడియాలో వైసీపీ అక్టీవిస్టులు తెగ హల్చల్ చేస్తున్నారు. దీంతో సమస్యను చల్లబరిచే క్రమంలో విశ్వక్సేన్ బహిరంగంగా సారీ చెప్పారు. సినిమా నిర్మాత కూడా సారీ చెప్పారు.

అయినా… వైసీపీ శ్రేణులు శాంతించలేదు. తమ మనోభావాలను దెబ్బ తీసిన పృథ్వీ నేరుగా వచ్చి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా.. పృథ్విపై సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ ప్రచారం అంతకంతకు పెరిగి పోతోంది. దేనిని చూసిన పృథ్వీ కి బీపీ పెరిగిపోయింది. ఉన్నట్టుండి ఆ పెరిగిన బీపీ మరింతగా పెరుగుతూ హై బీపీ గా మారిపోయింది. దీంతో పృథ్వీ హుటాహుటీన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.