రామరాజు ఫర్ భీమ్ టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంకొక్క రోజులో ఆ టీజర్ రాబోతోంది. ఇప్పటికే భారీగా ఉన్న అంచనాల్ని మరింత పెంచేలా కౌంట్ డౌన్ నడిపిస్తోంది చిత్ర బృందం. తాజాగా ఉత్కంఠను మరింత పెంచే అప్‌డేట్‌తో వచ్చాడు రామ్ చరణ్. రేపు రాబోయే టీజర్ ఎలా ఉంటుందో చిన్న గ్లింప్స్ లాంటిది చూపించాడు.
కొమరం భీమ్ బల్లెం తీసుకుని శత్రువుల మీదికి దండెత్తబోతున్నట్లుగా ఉన్న ఒక షార్ట్ టీజర్ చూపించాడు చరణ్. కొన్ని సెకన్లే ఉన్న ఈ వీడియో టీజర్ పట్ల ఎగ్జైట్మెంట్‌ను ఇంకా పెంచుతోంది. భీమ్ టీజర్లో విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేయడం ఖాయమనిపిస్తోంది. ఐతే ఈ వీడియో రిలీజ్ చేస్తూ తారక్‌ను ఉడికించేలా చరణ్ ఒక కామెంట్ కూడా చేశాడు.
మార్చి 27న ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ రిలీజ్ చేయడంలో కొంత ఆలస్యం జరిగింది. చెప్పిన టైంకి కాకుండా కొన్ని గంటల తర్వాత ఆ టీజర్ రిలీజ్ చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. నీలాగే నేను ఆలస్యం చేయను, రేపు చెప్పిన టైంకి వచ్చేస్తా అంటూ తారక్‌ను ఉద్దేశించి ట్వీట్ వేశాడు చరణ్.
ఐతే దీనికి తారక్ కూడా రివర్స్ పంచ్ గట్టిగానే వేశాడు. తన పుట్టిన రోజైన మే 20న రావాల్సిన టీజర్‌ను ఇప్పుడు రిలీజ్ చేస్తుండటాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆల్రెడీ ఐదు నెలలు ఆలస్యమైందని అన్నాడు. అయినా జక్కన్నతో డీల్ చేసేటపుడు జాగ్రత్తగా ఉండాలని, ఏమైనా జరగొచ్చిన అనడం ద్వారా రేపు ఆలస్యమైనా అవ్వొచ్చని పరోక్షంగా సంకేతాలిచ్చాడు తారక్. ముందు అన్న ప్రకారం అయితే గురువారం ఉదయం 11 గంటలకు భీమ్ టీజర్ రావాల్సి ఉంది. రామరాజు టీజర్‌కు తారక్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లే.. ఈ టీజర్‌కు చరణ్ వాయిస్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 21, 2020 2:30 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…