కెరీర్ ఎప్పుడో మొదలైనా, ఎన్నో హిట్లు చూసినా వంద కోట్ల క్లబ్ అందని ద్రాక్షగా నిలిచిన నాగచైతన్యకు అది తండేల్ రూపంలో దక్కడం నాగార్జునకి ఎక్కడలేని పుత్రోత్సాహాన్ని ఇస్తోంది. ఇంతకు ముందు చైతు ఎన్నో విజయాలు చూశాడు కానీ ఇప్పుడున్న స్టేజి వేరు. వరస ఫ్లాపులు మార్కెట్ ని దెబ్బ కొట్టాయి.
గుడ్డి నమ్మకంతో తమిళ హిందీ దర్శకులను నమ్మితే కస్టడీ, లాల్ సింగ్ చద్దా రూపంలో డిజాస్టర్లు ఇచ్చారు. అందుకే తండేల్ కోసం ఒళ్ళు హూనం చేసుకున్నాడు. ఏడాదిన్నర వేరే ఏ కథ వినకుండా, ఏ సినిమా ఒప్పుకోకుండా దీని మీదే మనసు లగ్నం చేశాడు. ఫలితంగానే అదిరిపోయే సక్సెస్ దక్కింది.
కొడుకుని ఎక్కువ పొగుడుకోకూడదనే ఉద్దేశంతో నాన్నగారు గుర్తొచ్చారని చెప్పిన నాగార్జున టీమ్ ని ప్రశంసలతో ముంచెత్తారు. చందూ మొండేటికి తమ ఇద్దరిలో ఎవరంటే ఇష్టమైనా తనకు మాత్రం వ్యక్తిగతంగా నువ్వే ఇష్టమని సభాముఖంగా చెప్పడం దర్శకుడి సంతోషాన్ని రెట్టింపు చేసింది.
హిందీ గజిని రూపంలో తొలి వంద కోట్ల మూవీ ఇచ్చిన ఘనత అల్లు అరవింద్ కు దక్కుతుందని కితాబు ఇచ్చారు. బన్నీ వాస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ తమ కుటుంబానికి 100 పెర్సెంట్ లవ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, తండేల్ ఇలా ఒకదాన్ని మించి మరొకటి సూపర్ హిట్స్ ఇవ్వడం గురించి అభినందనలు తెలిపారు.
ఇక దేవిశ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుతూ తమ కాంబోలో ఎన్నో మర్చిపోయేల్ని ఆల్బమ్స్ వచ్చాయని, తనకో లవ్ స్టోరీ చెప్పమని వేరొకరితో అన్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ వయసులో ఇక సాధ్యం కాదని చెప్పడం నవ్వులను పూయించింది.
నటీనటులను, సాంకేతిక వర్గాన్ని అభినందించిన నాగ్ చాలా గ్యాప్ తర్వాత కొడుకు అందుకున్న సక్సెస్ ని ఆస్వాదిస్తున్న మాట వాస్తవం. గత ఏడాది నా సామిరంగా బాగానే ఆడినప్పటికీ అదేమీ వంద కోట్ల మైలురాయికి వెళ్ళలేదు. కానీ తండేల్ దాన్ని సాధిస్తోంది. అందుకే అభిమానులతో పాటు చైతు కుటుంబ సభ్యులు ప్రతిఒక్కరిలో సంతోషం తొణికిసలాడుతోంది.
This post was last modified on February 11, 2025 9:44 pm
దివంగత అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించిన అజరామరమైన పాత్రల్లో తెనాలి రామకృష్ణ చాలా ముఖ్యమైంది. ఎన్టీఆర్ అంతటి దిగ్గజం శ్రీకృష్ణ…
వాలెంటైన్ వీక్ సందర్భంగా ఎక్కడ చూసినా ఎన్నో రకాల గులాబీలు.. వాటి సుగందాలు మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. గులాబీ పువ్వు…
ఇప్పుడు సినిమాల్లో క్వాలిటీ కంటెంట్, భారీతనం, బిజినెస్, కలెక్షన్స్.. ఈ కోణంలో చూస్తే బాలీవుడ్ మీద సౌత్ సినిమానే స్పష్టమైన…
ఏపీ సీఎం చంద్రబాబుకు ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర విన్నపం చేశారు. తరచుగా కేం ద్రంపై…
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై జరగుతున్న దర్యాప్తు సంచలన పరిణామాలకు దారి తీయనుంది. అసలు తిరుమల…
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో మోస్ట్ సర్ప్రైజింగ్, ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్ అంటే బుల్లిరాజు అనే పాత్రలో రేవంత్ అనే చిన్న కుర్రాడు…