Movie News

ధనుష్ రెండు పడవల ప్రయాణం భేష్

పక్క భాష నటుడని కాదు కానీ మన ప్రేక్షకులకూ బాగా పరిచయమున్న ధనుష్ ని కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా ప్రశంసించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మీడియం రేంజ్ హీరో అయినా ఒకే టైంలో ఒక సినిమా చేయడమే మహా కష్టంగా ఫీలవుతున్నారు. షూటింగ్ చేయడం దగ్గరి నుంచి ప్రమోషన్ల దాకా ఒకేదాని మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాంటిది నటిస్తూనే దర్శకత్వం చేయడమనేది కత్తి మీద సాము. ధనుష్ ఈ రెండు పడవల ప్రయాణాన్ని చాలా సాఫీగా నడిపించడమే తన గురించి ప్రస్తావించడానికి కారణమయ్యింది. కాస్త వివరంగా చూస్తే మీకే అర్థమవుతుంది.

గత ఏడాది జూలైలో రాయన్ విడుదలయ్యింది. ధనుష్ హీరోగా నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేశాడు. తెలుగులో జస్ట్ యావరేజ్ అనిపించుకుంది కానీ తమిళంలో బాగానే ఆడింది. తనతో పాటు సందీప్ కిషన్, అపర్ణ బాలమురళిలకు పేరు తెచ్చింది. కట్ చేస్తే సంవత్సరం తిరక్కుండానే ధనుష్ తాను జస్ట్ ఒక చిన్న పాత్ర పోషించి కుర్రకారుతో తీసి దర్శకత్వం వహించిన జాబిలమ్మా నీకు అంత కోపమా ఫిబ్రవరి 21 రిలీజ్ కు రెడీ అయ్యింది. ట్రెండీ లవ్ ఎలిమెంట్స్ తో రూపొందిన కంటెంట్ కావడంతో యూత్ కి బాగానే రీచ్ అయ్యేలా ఉందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇది చివరి దశలో ఉన్నప్పుడు ఇడ్లి కడాయ్ మొదలెట్టాడు.

ఇది ఏప్రిల్ 10 థియేటర్లకు వచ్చేందుకు సమాయత్తమవుతోంది. వాయిదా పడొచ్చనే టాక్ ఉంది కానీ ఇంకా నిర్ధారణ కాలేదు. అంటే కేవలం పది నెలల కాలంలో మూడు సినిమాలకు దర్శకత్వం వహించి వాటిలో రెండింటికి హీరోగా చేయడమంటే పెద్ద ఫీటే. ఒకప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ లాంటి వాళ్ళు ఇలా రెండు బాధ్యతలని గొప్పగా నిర్వర్తించేవాళ్ళు. కానీ ఇప్పుడా ట్రెండ్ లేదు. కానీ ధనుష్ మాత్రం నాకది సాధ్యమని చేసి చూపిస్తున్నాడు. అన్నట్టు యుగానికి ఒక్కడు 2ని తనతోనే తీసేందుకు అన్నయ్య సెల్వ రాఘవన్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఎప్పుడనేది చెప్పలేదు కానీ త్వరలోనే సెట్స్ కు వెళ్లనుంది.

This post was last modified on February 11, 2025 12:02 pm

Share

Recent Posts

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

1 hour ago

కుటుంబం సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి

నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…

1 hour ago

రాజమౌళి రాబోయే ‘ట్రబుల్’ని గుర్తించలేదా

స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…

2 hours ago

ఎవరూ పట్టించుకోని ‘యుగంధర్’ పోరాటం

కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…

3 hours ago

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

6 hours ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

14 hours ago