కెరీర్ ఆరంభంలో సెన్సేషనల్ హిట్లతో దూసుకెళ్లిన విజయ్ దేవరకొండ.. కొన్నేళ్ల నుంచి సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా లైగర్, ఫ్యామిలీ స్టార్ దారుణమైన డిజాస్టర్లయి అతడి కెరీర్‌ను గట్టి దెబ్బే తీశాయి. దీంతో అతడి ఆశలన్నీ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం మీదే ఉన్నాయి. ఈ సినిమా గురించి యూనిట్ వర్గాలు చాలా గొప్పగాచెబుతున్నాయి.
విజయ్ కెరీర్‌ను మళ్లీ మంచి మలుపు తిప్పే సినిమా ఇదవుతుందని భావిస్తున్నారు. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ కోసం విజయ్ ఫ్యాన్స్ చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించబోతోంది. ఈ బుధవారమే వీడీ 12 టైటిల్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ టీజర్‌కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అది జస్ట్ ప్రచారం కాదని, వాస్తవమే అని ఇప్పుడు తేలిపోయింది.
విజయ్-గౌతమ్ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ.. ఎక్స్‌లో పులి బొమ్మతో ఒక ట్వీట్ వేశాడు. అంతకుమించి ఆ పోస్టులో ఏమీ లేదు. తారక్‌ను అందరూ యంగ్ టైగర్ అంటారన్న సంగతి తెలిసిందే. వీడీ12కు తారక్ వాయిస్ ఓవర్ ఇచ్చాడనే విషయాన్ని ఈ బొమ్మ ద్వారా నాగవంశీ చెప్పకనే చెప్పేశాడని అర్థం చేసుకోవచ్చు.
తారక్‌తో వంశీకి మంచి అనుబంధం ఉంది. వంశీ నిర్మాతగా జూనియర్.. అరవింద సమేత లాంటి మెమొరబుల్ మూవీ చేశాడు. తారక్ లేటెస్ట్ హిట్ దేవరను వంశీనే డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఇక తారక్ బావమరిది నార్నె నితిన్‌ను హీరోగా లాంచ్ చేసింది వంశీనే. కాబట్టి అతను అడిగితే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి తారక్ వెనుకాడే అవకాశం లేదు.
మరోవైపు ఈ సినిమా హిందీ టీజర్‌కు రణబీర్ కపూర్, తమిళ టీజర్‌కు సూర్య గాత్రదానం చేసినట్టు తేలిపోయింది. టీజర్లో ఈ వాయిస్ ఓవర్‌ల ద్వారా వచ్చే ఎలివేషన్ ఒక రేంజిలో ఉంటుందంటున్నారు. టీజర్ చివర్లో విజయ్ పరిచయం ఉంటుందట.
This post was last modified on February 11, 2025 8:52 am
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గతంలో సంక్రాంతి సందర్భంగా గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ వేసిన వీడియో…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…