Movie News

జైల్లోనే సల్మాన్‌కు సుఖమైన నిద్ర

మనిషికి మంచి తిండి, సుఖమైన నిద్ర అత్యంత ముఖ్యమైన విషయాలు. నిద్ర విషయానికి వస్తే.. ఏ వయసులో అయినా సరే కనీసం ఆరు గంటలు పడుకోవాలని వైద్యులు చెబుతారు. ఆ మాత్రం నిద్ర లేకపోతే ఏ పనీ సరిగా చేయలేమని అంటారు. కానీ కొంతమంది మాత్రం తక్కువ నిద్రతోనే యాక్టివ్‌గా ఉంటారు. అన్ని పనులూ సవ్యంగా చేసేస్తారు. ఐతే మరీ రెండు గంటల నిద్రతో సరిపెట్టుకోవడం అంటే ఎలాంటి వ్యక్తికైనా కష్టమే. కానీ సల్మాన్ మాత్రం తాను రోజూ రెండు గంటలు మాత్రమే నిద్రపోతానని ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు.

‘‘నేను సాధారణంగా రోజుకు రెండు గంటలు మాత్రమే నిద్ర పోతాను. నెలలో ఒక్క రోజు మాత్రమే ఎనిమిది గంటలు పడుకుంటాను. కొన్నిసార్లు సినిమా చిత్రీకరణ సమయంలో సన్నివేశాల మధ్య విరామం వచ్చినప్పుడు కాసేపు కునుకు తీస్తాను’’ అని సల్మాన్ చెప్పాడు. సల్మాన్ ఎంత బిజీ నటుడైనప్పటికీ నిద్ర అన్నది మనిషికి అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఒకటి కాబట్టి.. మరీ రెండు గంటలు నిద్ర పోవడం ఏంటి అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

ఐతే తాను వరుసగా రోజూ ఎనిమిది గంటలు పడుకున్న రోజులు కూడా ఉన్నాయంటూ సల్మాన్.. జైల్లో గడిపిన రోజులను గుర్తు చేసుకోవడం విశేషం. ‘‘నేను షూటింగ్‌లు లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు కావాల్సినంత నిద్ర పోతాను. అందుకే జైల్లో ఉన్నప్పుడు హాయిగా 8 గంటలు నిద్రపోయాను. విమాన ప్రయాణాల్లో ఉన్నపుడు, ముఖ్యంగా ఏదైనా సాంకేతిక సమస్య వచ్చి ఆలస్యం అయితే ఆ సమయంలో కూడా నేను ఎక్కువగా నిద్రపోతాను.

ఎందుకంటే అప్పుడు నేనేం చేయలేను కదా’’ అని సల్మాన్ అన్నాడు. కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో, ఒక కారు ప్రమాదానికి సంబంధించిన కేసులో సల్మాన్ వేర్వేరుగా జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సల్మాన్ నటిస్తున్న ‘సికందర్’ రంజాన్ కానుకగా వచ్చే నెలలో విడుదల కానుంది.

This post was last modified on February 10, 2025 3:47 pm

Share

Recent Posts

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

17 minutes ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

52 minutes ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

56 minutes ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

2 hours ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

4 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

5 hours ago