Movie News

‘స్వాగ్’ చూపించాడు.. ‘సింగిల్’ అవతారమెత్తాడు

విలక్షణ చిత్రాలతో యువ ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు.. శ్రీ విష్ణు. ముందు క్యారెక్టర్ రోల్స్ చేసినా.. తర్వాత హీరో పాత్రలకు మారి, హిట్లు కొట్టడంతో తన స్థాయి పెరిగింది. శ్రీ విష్ణు సినిమా అంటే ఏదో ఒక వైవిధ్యం ఉంటుందనే భరోసా ప్రేక్షకుల్లో ఉంది. గత ఏడాది అతను ‘స్వాగ్’ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. విడుదలకు ముందు ఈ సినిమా మంచి హైపే తెచ్చుకుంది. కానీ ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఐతే బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు ఫలితాన్ని అందుకున్న ఆ చిత్రం.. ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ దక్కించుకుంది. కొన్ని రోజుల పాటు ఆ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. థియేటర్లలో సరిగా ఆడకపోయినా.. ఈ స్పందన శ్రీ విష్ణుకు ఆనందాన్ని ఇచ్చే ఉంటుంది. ఈ ఉత్సాహంలో అతను తన కొత్త సినిమాల పనిలో పడిపోయాడు. తన నెక్స్ట్ రిలీజ్‌కు సంబంధించి ఈ రోజు అప్‌డేట్ కూడా వచ్చింది.

శ్రీ విష్ణు నటిస్తున్న కొత్త చిత్రం పేరు ఈ రోజు ప్రకటించారు. ‘సింగిల్’ అనే ట్రెండ్ టైటిల్ పెట్టారీ చిత్రానికి. సోషల్ మీడియా కాలంలో పెళ్లి కాని వారిని సింగిల్ అని సంబోధిస్తూ కామెంట్లు చేయడం కామన్. ఈ మాట బాగా పాపులర్ అయింది. కాబట్టి ఇది యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే టైటిల్ అనే చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఇంట్రెస్టింగ్‌‌గా కనిపిస్తోంది. శ్రీ విష్ణు నుంచి యూత్ ఆశించే అల్లరి ఈ సినిమాలో ఉంటుందనే అనిపిస్తోంది.

ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేస్తుండడం విశేషం. కావ్య ఫిలిమ్స్ అనే మరో నిర్మాణ సంస్థకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. సందీప్ కిషన్‌తో ‘నిను వీడని నీడను నేనే’ సినిమా తీసిన కార్తీక్ రాజు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్నది వెల్లడి కాలేదు. ఈ రోజు సాయంత్రం విడుదల కానున్న ఫస్ట్ గ్లింప్స్‌లో ఆ విషయం తెలియొచ్చు. వేసవిలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తేవాలనుకుంటున్నారు.

This post was last modified on February 10, 2025 3:25 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

దళపతి విజయ్ వ్యూహం ?.. పీకేతో జట్టు?

తమిళ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ రాజకీయాల్లోకి శరవేగంగా దూసుకువస్తున్నారు. ఇప్పటికే తమిళగ వెట్రిగ కజగం పేరిట రాజకీయ పార్టీని…

40 minutes ago

తండేల్ తవ్వి తీసిన పైరసీ చీకటి కోణాలు

ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తంలో జరుగుతున్న చర్చ ఒక్కటే. గేమ్ ఛేంజర్ నుంచి తండేల్ దాకా అసలు హెచ్డి ప్రింట్స్ పైరసీ…

2 hours ago

చంద్ర‌బాబు లౌక్యం!: నామినేటెడ్ పోస్టుల‌కు జీతాలు ఫిక్స్

ఏపీ సీఎం చంద్ర‌బాబు లౌక్యం ప్ర‌ద‌ర్శించారు. కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. అనేక నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేశారు. వీటిలో…

2 hours ago

భారత్ రక్షణ శక్తి పెరుగుతోంది… ఏరో ఇండియా 2025లో హైలైట్స్!

ఏషియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనగా పేరుగాంచిన ఏరో ఇండియా 2025 బెంగళూరులో ఘనంగా ప్రారంభమైంది. ఈ ఎయిర్ షోలో భారత…

2 hours ago

ఆర్టీసీ బస్సులో తండేల్ పైరసీ… బన్నీ వాసు రియాక్షన్!

పైరసీ రోజు రోజుకూ ఎంత ప్రమాదకరంగా మారుతోందో ఇటీవలి పరిణామాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. రిలీజ్ రోజే మంచి క్వాలిటీతో హెచ్‌డీ…

3 hours ago

నాకున్న ఒకే మేనల్లుడు రామ్ చరణ్ – అల్లు అరవింద్

ఇటీవలే జరిగిన తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత అల్లు అరవింద్ గెస్టుగా వచ్చిన దిల్ రాజుని ఉద్దేశించి…

3 hours ago