Movie News

అరవింద్ కాదు అల్లు అర్జునే రైట్

తండేల్ ప్రాజెక్ట్ లాకైనప్పుడు సంగీత దర్శకుడిగా ముందు దేవిశ్రీ ప్రసాద్ తమ ఆప్షన్ గా లేడని నిర్మాత అల్లు అరవింద్ ఇటీవలే చెప్పిన సంగతి తెలిసిందే. పుష్ప 2లో బిజీగా ఉన్నాడు కాబట్టి తమ సినిమాకు న్యాయం చేయలేడని భావించి వేరే పేర్లు పరిశీలిస్తున్న టైంలో ఇలాంటి ప్రేమకథలకు డిఎస్పి అయితేనే న్యాయం చేయగలడని భావించి బన్నీ ఇచ్చిన సలహా మేరకే తిరిగి నిర్ణయం మార్చుకున్నాడు. చూస్తే ఇప్పుడా మార్పే గొప్ప ఫలితం ఇస్తోంది. తండేల్ సక్సెస్ లో ప్రధాన పాత్ర పోషిస్తోంది పాటలే. ముఖ్యంగా బీజీఎమ్ విషయంలో దేవి చూపించిన వింటేజ్ మార్క్ ప్రేక్షకుల ఎమోషన్ కి బాగా కనెక్ట్ అవుతోంది.

ఒకవేళ దేవిని కాదని మరొకరిని తీసుకుని ఉంటే ఇంత ఇంపాక్ట్ ఉండేది కాదేమోనన్న అభిప్రాయాన్ని కొట్టిపారేయలేం. ఎందుకంటే సినిమాలు తగ్గించినా చేసిన కొన్నింటిలోనూ డిఎస్పి ముద్ర మిస్ కావడం లేదు. పుష్ప 2 ది రూల్ కన్నా పెద్ద ఉదాహరణ అక్కర్లేదు. సంక్రాంతి రెండు భారీ సినిమాలకు పని చేసిన తమన్ కన్నా దేవి ఇచ్చిన ఆల్బమే ఎక్కువ మేజిక్ చేసింది. ఇప్పుడు తండేల్ రూపంలో మరో చార్ట్ బస్టర్ దక్కింది. బన్నీ పలు సందర్భాల్లో అన్నట్టు మెలోడీస్ ఇవ్వడంలో దేవి ప్రత్యేకత వేరు. బుజ్జితల్లి అంటూ మ్యూజిక్ లవర్స్ ని రాజు, సత్య ప్రేమలో పడేలా చేయడంలో దేవి గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఏప్రిల్ లో దేవి నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ రానుంది. ఇది ఫక్తు కమర్షియల్ సినిమా కావడంతో పాటల పరంగా మరోసారి మాస్ ని ఊపేయొచ్చు. కుబేర మీద కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. సున్నితత్వాన్ని మారు పేరైన శేఖర్ కమ్ములకు దేవి ఎలాంటి ట్యూన్స్ ఇచ్చి ఉంటాడనే ఆసక్తి మ్యూజిక్ లవర్స్ లో ఎక్కువగా ఉంది. అయితే ఫ్యాన్స్ వీటితో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ కాంబో కావడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. రామ్ చరణ్ 17కి తను పనిచేయడం దాదాపు ఖాయమే. రంగస్థలం మేజిక్ మరోసారి రిపీట్ కావడం కన్నా కిక్ ఏముంటుంది.

This post was last modified on February 9, 2025 11:54 am

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

41 minutes ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

48 minutes ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

2 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

3 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

6 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

8 hours ago